పార్లమెంట్ భవనంలోకి మళ్ళీ దుండగుల అక్రమ ప్రవేశం
న్యూఢిల్లీ :
పార్లమెంట్ భవనంలోకి ముగ్గురు దుండగులు జూన్ 07 రోజు ఉదయం అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించడంతో కలకలం రేగింది.
గేట్ నంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
గత డిసెంబర్లో సైతం దుండగులు పార్లమెంట్లోకి ప్రవేశించి పొగగొట్టాలతో సభ్యులను భయభ్రాంతు లకు గురి చేసిన ఘటన మరువకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది…..