రామోజీరావు గారి ప్రస్థానం ఇలా…
కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్16న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు రాజ్యలక్ష్మీ, రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు.
1947లో గుడివాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేరి 1951 వరకు సిక్త్స్ ఫాం వరకు చదివారు. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం దిల్లీలోని ఓ యాడ్ ఏజన్సీలో ఆర్టిస్ట్‌గా చేరారు.
19.08.1961లో తాతినేని రమాదేవితో వివాహం.
1962లో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
1962 అక్టోబరులో మార్గదర్శి చిట్‌ఫండ్ స్థాపన.
1965లో కిరణ్ యాడ్స్ ప్రారంభం.
1967-1969 వరకు ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం.
1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు.
1970లో ఇమేజస్ అవుట్‌డోర్ అడ్వర్టయిజింగ్ ఏజన్సీ ప్రారంభం.
1972-1973 విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం.
21.06.1980లో త్రీస్టార్ హోటల్‌గా డాల్ఫిన్ ప్రారంభం.
10.08.1974లో విశాఖ ‘ఈనాడు’ దిన పత్రిక ప్రారంభం.
12.08.1974లో మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభం.
1975 డిసెంబరు 17న ‘ఈనాడు’ హైదరాబాదు ఎడిషన్ ప్రారంభమైంది.
03.10.1976లో సినీ ప్రేమికుల కోసం ‘సితార’ పత్రికను ప్రారంభించారు.
ఫిబ్రవరి 1978లో ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికల ప్రారంభం.
09.02.1980లో ‘ప్రియా ఫుడ్స్’ ప్రారంభం.
02.03.1983లో ‘ఉషాకిరణ్ మూవీస్’ సంస్థ ఏర్పాటు.
1990లో ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ ప్రారంభం.
1992-1993లో సారాపై సమరం. మధ్యంపై నిషేద ఉత్తర్వులు వచ్చేదాకా పోరు.
1996లో ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ స్థాపన
27.01.2002లో ‘ఈటీవీ’ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతీయ ఛానళ్ల ప్రారంభం.
20.06.2002లో ‘రమాదేవి పబ్లిక్ స్కూల్’ ప్రారంభం.
14.04.2008లో సమాచార చట్టం కోసం ‘ముందడుగు’
25.12.2014లో ప్రధాని మోదీ ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా రామోజీరావును నామినేట్ చేశారు.
14.11.2015లో మరో నాలుగు ఈటీవీ ఛానళ్ల ఆరంభం.