యువ జంట ఉరివేసుకొని ఆత్మహత్య.
అచ్చంపేట :
అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం జింకుంట గ్రామానికి చెందిన యువ జంట ఆత్మహత్య పాల్పడింది సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరు తమ వ్యవసాయ పొలంలో చెట్టుకు వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలో కలకలం రేపింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జిన్ కుంట గ్రామానికి చెందిన మహేష్ భానుమతి అనే ఇద్దరు యువతీ యువకులు గత సంవత్సర క్రితం ప్రేమలో పడ్డారని ఈ నేపథ్యంలో భానుమతి మైనర్ కావడంతో మహేష్ ను చట్టం ప్రకారం శిక్షించారు తను జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత తిరిగి మరల ఇష్టపడ్డ భానుమతితో ఏదో రకంగా మాటామంతి కలుపుకొని తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నాడు అని, ఏడాది తిరగకుండా ఏం జరిగిందో తెలియదు కానీ శనివారం రాత్రి వారి వ్యవసాయ పొలంలో చెట్టుకు ఇద్దరు భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఆత్మహత్య సంఘటనపై అచ్చంపేట సిఐ రవీందర్ విచారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.