తెలంగాణ రైతులకు షాక్… ఈ నెలలో రైతుబంధు నిధులు కష్టమే
తెలంగాణ రైతులకు షాక్ తగిలి ఛాన్స్ ఉంది…ఈ నెలలోనే రైతుబంధు నిధులు రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్ వచ్చి…వారం రోజులు అవుతున్నా..
తెలంగాణ సర్కార్ రైతు బంధు ఊసే ఎత్తడం లేదు. దీంతో రైతుబంధు ఇచ్చేది ఎప్పుడు అంటూ తెలంగాణ రాష్ట్ర రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరానికి రూ. 5,000 చొప్పున ఇచ్చే రైతుబంధు కాదు.. ఎకరానికి రూ. 7500 రైతుభరోసా ఇస్తామని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ గత యాసంగి పంటకు సంబంధించిన నిధులనే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు మృగశిర కార్తె అయిపోయి.. నాట్లు మొదలై, దుక్కులు దున్నుతుంటే పెట్టుబడి సాయం కోసం ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఇచ్చే రైతుబంధు గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు కార్యాచరణ లేదు. దీంతో ఈ నెలలోనే రైతుబంధు నిధులు రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది.