MPల్లో 93 శాతం మంది కోటీశ్వరులే… ADR
504 మంది కోటీశ్వరులు.
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో 93శాతం మంది కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్’ (ఏడీఆర్) తెలిపింది.
గత ఎంపీల్లో 475 మంది మిలియనీర్లు ఉండగా, ఈసారి 504కు పెరిగిందని వెల్లడించింది. ధనిక ఎంపీల్లో గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,705 కోట్లతో మొదటి స్థానంలో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి రూ.4,568 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారని తెలిపింది.
Bc,Sc, St ఓట్లు వేస్తే వీళ్ళు మాత్రం వారి గురించి పక్కన పెట్టి కోట్లు సంపాదించుకుంటున్నారు.. ఇది వీళ్ల రాజకీయం మనకు అర్ధం కాదు అ ముచ్చట ఎన్నికల సమయంలో 500,1000 తీసుకున్నమా ఓట్లు అయిపోయే దాక వాళ్ళు పోసిన మందు తాగినామ లేదా అంతే మిగతా విషయం మనకు ఎందుకు.
అభివృద్ధి గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, భవిష్యత్ తరాలకోసం, చదువుకున్న వారికి ఉద్యోగం గురించి, సామాన్య ప్రజల గురించి మధ్య తరగతి వాళ్ళ బతుకు గురించి, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, భూమి, ఇల్లు ఇవేవి మనకి పట్టని, రాజకీయ అచైతన్యులం మాకు రాజకీయం అసలే పట్టదు..