ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం వల్లే కబ్జాలు…?
కండ్లపల్లి గ్రామ శివారులో.. నాడు రోళ్ల వాగు ఎడమ కాలువ.. నేడు ఘంటన చెరువు కబ్జా..?
ఇరిగేషన్ శాఖ అధికారుల తీరు పట్ల గ్రామస్థుల మండిపాటు…
జిల్లా కలెక్టర్ కు న్యాయం కోరుతూ పిర్యాదు చేసిన గ్రామస్తులు….
జగిత్యాల జిల్లా :
బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామ శివారులోని రోళ్ల వాగు ఎడమ కాలువను మండోజు లచ్చన్న. శీలం నారాయణ కబ్జా చేశారని చర్యలు చేపట్టుటకు గతంలో నీటిపారుదల ఉప కార్య నిర్వాహక అధికారి గ్రామ ప్రత్యేక అధికారికి లేఖ రాసిన సంగతి తేలిసిందే కానీ.. కండ్లపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆస్తులను ఒక్కరిని మించి మరొకరు కబ్జా చేసి బీర్పూర్ మండలంలోనే ఆదర్శమవుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి.
కొందరు రోళ్ల వాగు ఎడమ కాలువ కబ్జా చేస్తే మరికొందరు మేమేమి తక్కువ తినలేదనే చందనా ఏకంగా గ్రామంలోని ఘంటన చెరువునే కబ్జా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో గ్రామంలోని ప్రజలు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి కార్యక్రమం ద్వారా పిర్యాదు చేశారు. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారులు రోళ్ల వాగు ఎడమ కాలువ పై నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చడమే కాకుండా ఘంటన చెరువు ను కబ్జా చేయుటకు ప్రయత్నం చేసిన వ్యక్తులతో పాటు చెరువు పనులకు వాడిన జేసీబీ. రెండు ట్రాక్టర్ల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేక రాజీ కుదుర్చుకుంటారో అని కండ్లపల్లి గ్రామంలోని ప్రజలు ముచ్చటించుకోవడం చర్చనీయాంశంగా మారింది…