తల్లితండ్రులు మారాలి…!

తల్లితండ్రులు మారాలి…!

పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10% మాత్రమే కారకులు!

కానీ 90% కారకులు తల్లిదండ్రులే.!

పిల్లల్ని గారాబం మరీ ‘శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, వారిని నాశనం చేస్తున్నారు.

ఇప్పుటి తరం 70% పిల్లలు..తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు. మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.

లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.

కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.

రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవమంటే లేవరు.

గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు.

తిడితే వస్తువులను విసిరి కొడతారు.. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు.

ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.

ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి.