తెలంగాణాలో పడకేసిన శాంతిభద్రతలు

తెలంగాణాలో పడకేసిన శాంతిభద్రతలు

ఒళ్ళుగగుర్లు పొడిచేలా హత్యలు అత్యాచారాలు

చోద్యం చూస్తున్న ప్రభుత్వం, పోలీసులు

పీఆర్ స్టెంట్ల బిజీలో ముఖ్యమంత్రి

24 గంటల్లో నాలుగు దారుణమైన ఘటనలు

నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం. అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన వైనం. చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా 100 డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి.

ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు. పెద్దపల్లి లో నిన్న రాత్రి ఓ రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తరప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు.

ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుతుబ్బుద్దీన్ అనే యువకుడి పై కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు
ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకున్ని స్థానికులు మెహిది పట్నం నాలనగర్ లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ – అయ్యప్ప సొసైటీలో ఉన్న CGR స్కూల్ హాస్టల్లో వాటర్ నింపుతుండగా తమ వాహనం పోవడానికి లేకుండా అడ్డు పెడతావా అంటూ కొందరు యువకులు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సయ్యద్ సలీం ని తల పగిలేలా కొట్టారు.