పాపం ఒడిషా చాలా చాలా వెనుకబడిన రాష్ట్రం
మన ఆంధ్రప్రదేశ్ లాగా సలహాదారులు మేధావులు లేరు. మనకు పనికి రాని మేధావులు సలహాదారులు ఎక్కువైపోయారు! !!
సంస్కారం కు నిలువెత్తు నిదర్శనం, 24 సంవత్సరాలు సీఎం గా పనిచేసిన తరువాత ఓటమి చవి చూసిన కూడా కాబోయే బీజేపీ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.
ఇరు పార్టీల నేతలు కలసి వేదికపై కూర్చోగలిగిన నాడే ! వివిధ పార్టీల కార్యకర్తలు కలసి ప్రశాంతంగా జీవించగలుగుతారు.
” ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారిని తాజా మాజీలు ఆదర్శంగా తీసుకోవాలి.
ప్రజాస్వామ్యం అంటే ? వ్యక్తిగత పోట్లాట కాదు… కొట్లాట అంత కంటే కాదు…
కేవలం ప్రజా సమస్యల పైన ప్రతిఘటనం.పరిష్కారల పై పోరాటం.గొప్ప నాయకునిగా పేరు తెచ్చుకునే ఆరాటం.
పది కాలాలపాటు సంక్షేమ మరియు అభివృద్ధి సహిత పరిపాలన ప్రయాణ ప్రయత్నం.
గతంలో పార్టీల యొక్క గెలుపు ఓటములు ఆ ప్రభుత్వాలు అవలంబించే విధివిధానాలపై పథకాలపై పరిపాలనపై ఆధారపడి ఉండేవి.
కానీ నేడు ఆ గెలుపు ఓటములు ప్రజా “భావోద్రేకాలపై” “అభద్రతా భావాలపై” ఆవేదనలపై” ఉక్రోస ఆక్రోసాలపై ఆధారపడి ఉంటున్నాయి.
రోషంతో ద్వేషం…అనుచిత ఆవేశం…వ్యక్తిగత దూషణం…జనజీవనములో ఆందోళనకర వాతావరణం…పరుష పదజాలం… ఉద్యోగస్వామ్యం అసక్తతతో ప్రభుత్వంతో మిళితం.మేధావుల అభిప్రాయాలని బేకాతర చేయటం మొదలగునవి
ప్రధాన కారణములు మరియు కారకములుగా మారుతూ, అనూహ్య రీతిలో ప్రభావితం చూపుతున్నాయి.
ఈ దుస్సంస్కృతిని ఏదో సమయంలో తటుస్తుల, పరిపాలనాదక్షుల ప్రమేయంతో మరియు సలహా సంప్రదింపులతో తెర వేయాలి.
అధికారంలోకి వచ్చిన పార్టీలు మంచి ప్రభుత్వాలుగా స్థిరపడాలి.
కంటికి కన్ను…పంటికి పన్ను… కర్ర కర్ర…కత్తికి కత్తి… అనే సంస్కృతి కొనసాగించుకుంటూ పోతే !చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది.
మిమ్మల్ని గెలిపించి…ప్రజలు ఓడిపోతుండడం…అనే మాట ఖాయ మౌవుతుంది.
“చట్టాలు బలహీనులందు బలంగాను… బలవంతులు యందు బలహీనంగాను” పనిచేసే లోపాన్ని సరిదిద్దాలి.
సహజంగా చట్టాన్ని అమలు చేసే న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయి తప్ప, విచక్షణ కోల్పోతూ…ద్వేషాన్ని వ్యక్తం చేస్తూ… పరిహాసము చేయువు. ఎందుకంటే ! భారత శిక్షాస్మృతి యొక్క ప్రధాన లక్ష్యం సంస్కరించడమే తప్ప… సంహరించటం కాదు. కానీ ప్రతిపక్షాల వారు సంహరించాలనే దురుద్దేశంతో పరిహాసం చేస్తూ…పైశాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.కాలానికి ఉండే గొప్ప జ్ఞాపక శక్తి ఆధారంగా ఓట్లు వేసే సమయంలో పరిహాసానికి ప్రతిఫలాన్ని చూపించేస్తారు ప్రజలు.
మానసిక అంశాలు మామ్మోలుగా అర్థం కాకపోవచ్చు…కానీ అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైనది.
అధికారం ఎలాంటిదంటే ? ఎండు దురదలు వంటిది…గోకుతున్నంతవరకు హాయిగానే ఉంటుంది. ఓసారి గోకుడు విడిచిపెట్టిన తర్వాత ఆ మంట అర్థమవుతుంది. అధికారంలో ఉన్నంతవరకు తీవ్రస్థాయి విమర్శలన్నీ హాయిని ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటాయి. అది ఏ పార్టీ అయినా ! ఓసారి అధికారం కోల్పోయాక వాటి మంట ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది.
అందుకే మాటల మంటలు ఆపండి ద్వేషపు…జ్వాలలు ఆర్పండి…