నాలుగు నెలల్లో 1,770 కోట్లు లూటీ… 5 నెలల్లోనే 8 లక్షల సైబర్ కేసులు…!!
దేశంలో సైబర్ నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి.
గడిచిన ఐదు నెలల్లోనే సుమారు 8 లక్షలకు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయి.
గత మూడేండ్లుగా దేశంలో పౌరులు సైబర్ నేరాల బారిన పడటం పెరుగుతున్నది.
సైబర్ నేరాల్లో యూపీఐ, క్రెడిట్‌కార్డు, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలు అత్యధికంగా ఉన్నట్టు లోకల్ సర్కిల్స్ సర్వే నివేదికలు వెల్లడించాయి.
పట్టణ ప్రజల్లో ఎక్కువశాతం పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట పంపిన లింక్‌లు, క్యూఆర్కోడ్లకు డబ్బులు చెల్లించి మోసపోయినట్టు సర్వే తెలిపింది.