జగిత్యాల జిల్లా…
ప్రతి పిర్యాదు పట్ల స్పందిస్తాం: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.
గంజాయి రవాణా, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిఘా.
జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యo అని జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు అన్నారు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎస్పి గారు మాట్లాడుతూ…
జిల్లా పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పావు , విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అన్నారు.
మహిళలు రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముఖ్యంగా పోకరిలా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు షీ టీమ్ పనిచేస్తుంది. మహిళల రక్షణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
షీ టీం ఫోన్ నెంబర్( 8712670783) తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిలా వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు విద్యార్థినిలు నిర్భయంగా ముందుకు రావాలని సూచించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికపై పోలీస్ స్టేషన్ల వారీగా నిరంతరగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం అన్నారు.
జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణాపై పటిష్ట నిఘ ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి బారిన పడిన యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలి అన్నారు. సైబర్ నేరస్తులు కొత్త విధానాలు కొత్త మార్గాలను అనుసరిస్తూ ప్రజలను ఆర్థికంగా మోసం చేస్తున్నారు వాటినీ అరికట్టేందుకు ప్రజలకు సైబర్ నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా అన్నారు.
జిల్లాలో అనుమతి లేకుండా ఫైనాన్స్ లు నిర్వహించిన ,సామాన్యుల నుంచి అధిక వడ్డీ వసూలు చేసిన చట్టపరమైన చర్యలకు వెళ్తాం. వడ్డీ వ్యాపారులు వేధిస్తే బాధితులు నేరుగా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.జిల్లా నుంచి గల్ఫ్ వెళ్ళేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఇమ్మిగ్రేషన్, చట్టబద్ధత ఉన్నవారు నుంచి వీసాలు పొందాలి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. బాధితుల ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేస్తాం.