ఎర్రచందనం స్మగ్లింగ్’పై … డిప్యూటీ CM పవన్ కీలక ఆదేశాలు… పారిశ్రామిక కాలుష్యంపైనా మంత్రి సమీక్ష..
ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రాష్ట్రం నుంచి నేపాల్‌కు తరలిపోయిన ఎర్రచందనాన్ని వెనక్కి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
అదే విధంగా కాలుష్య నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పవన్ ఆదేశించారు.
కృష్ణా, గోదావరి నదీ జలాలు కలుషితంపై ప్రత్యేకంగా సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
నేపాల్ దేశంలో 172 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దొరికిందని మంత్రి స్పష్టం చేశారు. ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టడానికి టాస్క్ ఫోర్స్‌ను బలోపేతం చేస్తామని తెలిపారు.
శాసనసభ హౌస్ కీపింగ్ సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ సమస్యలను చెప్పుకొన్నారు. హౌస్ కీపింగ్ సిబ్బంది మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 154 మంది వరకు శాసనసభలో పనిచేస్తున్నామని, రాజధాని ప్రాంత రైతు కూలీలమని ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పారు. 8 సంవత్సరాల కిందట రూ.6 వేలకు ఉద్యోగంలో చేరామని ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నారన్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలో ఉన్నామని తెలిపారు.
హౌస్ కీపింగ్ ఉద్యోగుల సమస్యను ఆసాంతం విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, తగు విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.