MLC రమణ , మాజీ మంత్రి రాజేశం గౌడ్ , BRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్… తెలంగాణ భవన్
ఎమ్మెల్సీ ఎల్ .రమణ …
జగిత్యాల BRS MLA కాంగ్రెస్ లో చేరడం అనైతిక చర్య.
వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ సంజయ్ ను రాజకీయాలకు పరిచయం చేసింది బీ ఆర్ ఏస్సే.
రాష్ట్రం లో ఉన్నది రాహుల్ కాంగ్రెస్ యా ?రేవంత్ కాంగ్రెస్ యా ?
ఓ పార్టీ నుంచి ఎన్నికైన వారు మరో పార్టీ లోకి వెళితే తక్షణం అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ మేనిఫెస్టో లో రాహుల్ గాంధి పెడితే ఇక్కడ రేవంత్ కండువాలు కప్పుతున్నారు.
కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలతో ముందుకు వెళ్తోంది.
.డాక్టర్ సంజయ్ చేసింది నీతి బాహ్యమైన చర్య.
జగిత్యాల లో ఆయన పై అంతటా నిరసన వ్యక్తం అవుతోంది.
రాహుల్ గాంధి బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం పై స్పందించాలి.
తాము మేనిఫెస్టో లో పెట్టిన అంశాన్ని తామే ఉల్లంఘిస్తున్న తీరు పై రాహుల్ స్పందించాలి.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా కోర్టు లో శిక్ష తప్పదు.
రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత 9 మంది నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
సిరిసిల్ల లో ఆరుగురు ,ఖమ్మంలో ఇద్దరు ,కరీం నగర్ లో ఒక్కరు చొప్పున ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
కాంగ్రెస్ మాటలకే పరిమితమైంది చేతలు శూన్యం.
అసెంబ్లీ లో నేత కార్మికుల అంశం పై బీ ఆర్ ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది.
తక్షణమే ఉన్నత స్థాయి సమావేశం ఎర్పాటు చేసి వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించాలి.