భూ సమస్యలు పరిష్కారం అయ్యేనా…!! కొత్త రెవెన్యూ చట్టం అమలు సాధ్యమేనా…!! దగా చేసిన ధరణి…!!

భూ సమస్యలు పరిష్కారం అయ్యేనా…!! కొత్త రెవెన్యూ చట్టం అమలు సాధ్యమేనా…!! దగా చేసిన ధరణి…!!

తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యలను వెంటనే ఆగ మేఘాల మీద పరిష్కరిస్తామని ఒక సెంటు భూమి కూడా తేడా లేకుండా రైతుల మధ్య గొడవ లేకుండా శాటిలైట్ సర్వే ద్వారా భూ సర్వే ను చేపడుతున్నామని అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రకటనలు హామీలకే పరిమితమయ్యాడు.

ఏ ఒక్క సమస్య కూడా గత ప్రభుత్వ హాయంలో పరిష్కారం కాలేదని రైతులు అంటున్నారు, ధరణి పోర్టల్ తీసుకొచ్చిన ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ధరణి దగా చేసిందని విమర్శలు వస్తున్నాయి అంతేకాక ఆర్ ,ఓ ,ఆర్ చట్టాన్ని రద్దు చేస్తూ ఆర్డిఓ రెవెన్యూ కోర్టు కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న లక్షలాది భూ తగాదాలను రెవెన్యూ కోర్టులను రద్దు చేసింది, వెంటనే గత ప్రభుత్వం 2020 సంవత్సరంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ట్రిబునల్ కోర్టులను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా భూతగాదాలు లేకుండా తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయా జిల్లాలోని జిల్లా కలెక్టర్లు ట్రిబునల్ కోర్టుల్లో కేసులు పరిష్కరించకుండా తూతూ మంత్రంగా మొక్కుబడిగా కేసులు నడిపించి వాదులకు ప్రతి వాదులకు.

ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా వాదోపవాదాలు వినకుండా రికార్డులను పరిశీలించి ఏకపక్షంగా తీర్పులు చెప్పడం జరిగింది.

ఎక్కువ శాతం కేసులు సివిల్ కోర్టుకు వెళ్ళమని ట్రిబినల్ ఆర్డర్ జారీ చేసింది, ఈ తతంగం వ్యవహారం ఎంతవరకు సమంజసము ఈ విషయం పట్ల గత ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది, దీనివల్ల గత టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది.

అంతేకాక భూముల తగాదాలు గెట్లు, బాట పంచాయతీలు ఈ రాష్ట్రంలో రైతులను పట్టిపీడిస్తున్నాయి అయినా కూడా గత ప్రభుత్వం శాటిలైట్ సర్వే ద్వారా లేకుండా ఒక్క సెంటు భూమి కూడా తేడా లేకుండా అక్షాంశాలు రేఖాంశాల పేరుతోనా కొలతలు సర్వే చేస్తామని చెప్పి అందుకోసం 300 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఎక్కడ కూడా శాటిలైట్ సర్వే భూముల సర్వే జరగలేదు.

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాల కాలం గడిచినా భూములను రీ సర్వే చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి, గత సంగతి ఆ విధంగా ఉన్నప్పటికీ మళ్లీ ఇటీవల నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో రైతు ప్రభుత్వంగా ప్రజాపాలన ప్రజల ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసనిధులు ఎకరాకు 7500 చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టి ధరణి పోర్టల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ భూ తగాదాలు లేకుండా భూ సర్వే శాటిలైట్ సర్వే చేస్తామని చెప్పినప్పటికీ రైతాంగం నమ్మలేకపోతున్నారు.

అంతేకాక ఈ రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులు రద్దుచేసిన గత ప్రభుత్వం ట్రిబ్యునల్ కోర్టులను ఏర్పాటు చేసి న్యాయం చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిబ్యునల్ కోర్టుల పేరుతో ముందుకు వస్తుంది 2020 సంవత్సరం ఆర్, ఓ ,ఆర్ చట్టాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది పాత చట్టం లో సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి 2024 ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా రూపకల్పనలో రాష్ట్ర మంత్రివర్గం అధికారులు అడుగులు ముందుకేస్తున్నారు.

గత ప్రభుత్వంలో ట్రిబ్యునల్ కోర్టులో స్పష్టత లేదని భావించి భూ తగాదాలు ఇప్పటికి దర్శనమిస్తున్నాయని కొత్త ఆర్ఓఆర్ చట్టం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని 18 లక్షల ఎకరాల భూములు పార్ట్ బి లో ఉన్నాయని 9 లక్షల సదా బైనమాలు.

పెండింగ్లో ఉన్నాయని పట్టా భూములతో పాటు అసైన్డ్ భూములు , మిస్సింగ్ సర్వే నెంబర్లు ఇనాం భూములు, పెండింగ్ లో ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది, అందుకే 2020 ఆర్, ఓ ఆర్ చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ చట్టానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఈ చట్టం ద్వారా రాష్ట్రంలోని 24 లక్షల ఎకరాల భూములు రైతులు సాగుకు నోచుకోలేకపోతున్నారు.

వీటితోపాటు ధరణి పోర్టల్లో సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది, కానీ గత ప్రభుత్వ హయాంలో 9 సంవత్సరాల కాలం పాటు చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కాలంలో రైతాంగ సమస్యలు తగాదాలు ధరణి పోర్టలో నెలకొన్న సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది అసైన్డ్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి.

మరికొంతమంది పేద రైతులు తెలిసి తెలవక అసైన్డ్ భూములను కొనుగోలు చేశారు.

ఎలాంటి భూమి లేని నిరుపేదలను గుర్తించి ప్రభుత్వం వెంటనే అసైన్డ్ భూములపైన యాజమాన్య హక్కులు కల్పించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు, గత టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద రైతులు భూమి కొనుగోలు చేస్తే వాళ్ళ పేరుమీద పట్టాలు జారీ చేస్తామని అసైన్డ్ భూములపై పూర్తి అధికారాలు కల్పిస్తామని చెప్పిన విషయం కూడా రైతులు గుర్తుచేస్తున్నారు.

చెప్పడం వరకే గత ప్రభుత్వం పనితీరు, కానీ అమలు కాలేదు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తక్షణమే కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడానికి వేగవంతంగా అడుగులు ముందుకేస్తుంది.

కాలయాపన చేయకుండా అమలు చేయాలని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని వీటితోపాటు భూముల సర్వే శాటిలైట్ సర్వేను వెంటనే చేపట్టాలని కోరుతూ ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతులు ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే విధంగా లేకుండా గత ప్రభుత్వాన్ని కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన పాలన అందించాలని మాయమాటలతో కాలం గడుపుకునే పద్ధతి ఉపసంహరించుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఎప్పుడు భూ సమస్యలు పరిష్కారమవుతాయో ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు, ధరణి పోర్టల్ పూర్తిగా రద్దు చేయాలని వెంటనే 2024 కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించాలని అప్పుడే ప్రభుత్వం పైన విశ్వాసం కలుగుతుందని అంటున్నారు.

రాష్ట్రంలోని రెవెన్యూ తహసిల్దార్ కార్యాలయాలలో జిల్లా కేంద్రంలోని భూముల సర్వేకు సంబంధించిన ల్యాండ్ సర్వే రికార్డు అధికారుల దగ్గర ఎలాంటి సర్వేకు సంబంధించిన టిఫన్, గ్రామ నక్ష, నక్కలు దొరకపోవడం దారుణం అదేవిధంగా రెవెన్యూ కార్యాలయాలలో కూడా పాత పహానిలు ఆర్ఓఆర్ పుస్తకాలు.

1 బి, కాస్త్ర పహాని, అందుబాటులో లేకపోవడమే రెవెన్యూ అవినీతికి నిదర్శనం విషయపైన ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయంలోని పత్రాలను జిల్లా కేంద్రంలోని సర్వే అధికారుల దగ్గర ల్యాండ్ రికార్డ్ సంబంధించిన భూముల సర్వే మ్యాపులు పైన విచారణ జరిపించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.

చట్టాలు మార్చడం క్యాబినెట్ ఉపసంఘం పేరుతోనా ఈ ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఈ రాష్ట్రంలోని వ్యవసాయ భూములతో పాటు అసైన్డ్ భూములు, ఇనాం భూములు, పట్టా భూముల సమస్యతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తశుద్ధితో పనిచేసే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

అంతేకాక వ్యవసాయ భూముల సర్వే చెయ్యక గత 75 సంవత్సరాల కాలం నుంచి భూముల పంచాయతీలు హద్దులు ,గేట్లు, బాట, తదితర సమస్యలను శాటిలైట్ సర్వే ద్వారా వెంటనే పూర్తి చేయాలని రైతుల కోరుతున్నారు ,ఈ విషయం పైన ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని లేనిపక్షంలో స్వయంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేయడానికి రైతులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది.