AP మాజీ CM జగన్ మితిమీరిన భద్రత ఏర్పాటు చేసుకున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు

AP మాజీ CM జగన్ మితిమీరిన భద్రత ఏర్పాటు చేసుకున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు

మాజీ సీఎం జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం 986 మంది పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు.

సీఎం చంద్రబాబుకు పోటీగా జగన్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు.

సముద్రం, ఆకాశం, భూమిపై పోరాడేలా శిక్షణ ఇప్పించారు.

ఇజ్రాయెల్ ఆయుధాలు తెప్పించారు.

జగన్ భద్రత కోసం ప్రాణాలకు తెగించి పోరాడేలా 379 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

రాష్ట్రపతి, ప్రధానమంత్రిని మించిన స్థాయి భద్రత ఏర్పాటు చేసుకోవడం ద్వారా సెక్యూరిటీ మాన్యువల్ ను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి.

జగన్ తన ప్యాలెస్ కు ఆక్టోపస్ కమాండోలతో భద్రత కల్పించుకున్నారని, బూమ్ బారియర్స్, టైర్ కిల్లర్స్, బొల్లార్డ్స్, రిట్రాక్టబుల్ గేట్లు ఏర్పాటు చేసుకున్నారని, తాడేపల్లి ప్యాలెస్ కు 30 అడుగుల ఎత్తున ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.