మేడిగడ్డ బ్యారేజీతో రాష్ట్రానికి రూ. 800 కోట్ల పైన లాభం అర్జించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం

మేడిగడ్డ బ్యారేజీతో రాష్ట్రానికి రూ. 800 కోట్ల పైన లాభం అర్జించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం

మేడిగడ్డలో ఇసుక అమ్మకం ద్వారా భారీగా ఆదాయం.

కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది అన్న ప్రభుత్వానికి ఇప్పుడు కాసుల వర్షం కురవబోతుంది.

200, 300 కోట్లు పెట్టి పిల్లర్లు రిపేర్ చేయించలేని రాష్ట్ర ప్రభుత్వం అక్కడున్న ఇసుక అమ్మి కోట్ల రూపాయల ఆదాయం పొందబోతుంది.

బ్యారేజి పిల్లర్లు కుంగిన తర్వాత నీటిని కిందకు వదలడంతో భారీగా ఇసుక మేటలు బయటపడ్డాయి.. వీటిని తవ్వి ఇసుకని విక్రయించడం ద్వారా రాష్ట్రానికి రూ. 800 కోట్లు పైన ఆదాయం రానుంది.

ముందుగా 14 బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం.. వేలం వేసే భాద్యతను రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థకు అప్పగించింది.

జూలై మొదటి వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది.. త్వరలోనే మరిన్ని బ్లాకులనుండి ఇసుకను వెలికి తీయాలని భావిస్తుంది.

మరో వైపు మేడిగడ్డ బ్యారేజికి ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజిలోను ఇసుక లభ్యతపై జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

ఇసుక వెలికితీతకు ఎలాంటి ఆటంకాలు లేకుంటే ఖజానాకు కాసుల వర్షం కురుస్తుందని టీజ