యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి… జగిత్యాల జిల్లా SP అశోక్ కుమార్ IPS

జగిత్యాల జిల్లా….

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి… జిల్లా SP అశోక్ కుమార్ IPS గారు.

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం – అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కారించుకొని JNTU ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలన గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమ0 నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..

సమాజంలో జరుగుతున్న చాలావరకు నేరాలు మత్తు పదార్థాలకు బానిస అయిన వారు చేసినవే అని మత్తు పదార్థాలు ఉపయోగించడం ద్వారా యువత తమ యొక్క ఉజ్వల భవిష్యత్తుని కోల్పోతున్నారని యుక్త వయసులో తెలిసి తెలియక వివిధ ప్రభావాల వల్ల చెడు అలవాట్లకు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంట్టుందని చెడు అలవాట్లను దూరం చేసుకొన మంచి అలవాట్లను ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి రాగలుగుతారని అన్నారు. డ్రగ్స్‌ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్‌ లేకుండా చేస్తుందనే విషయాన్ని యువత గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్జప్తి చేశారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత విజయాలను చేరుకొని తల్లిదండ్రులకు మంచి పెరు తీసుకరవాలని అన్నారు.మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత/విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని పెర్కొన్మారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు, తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే సంబధిత సమాచారాన్ని స్థానిక పోలీసులకు గాని, డయల్-100 కు గాని ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ గారు తెలిపారు.

ఈ యొక్క కార్యక్రమంలో JNTU principal ప్రభాకర్,డీఎస్పీ రఘు చందర్, సి.ఐ రవి,కోడిమ్యాల ఎస్.ఐ సందీప్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు