గృహజ్యోతి స్కీమ్… ఆన్ లైన్ పొరపాట్లతో పలువురికి కరెంట్ బిల్లులు

గృహజ్యోతి స్కీమ్.. ఆన్ లైన్ పొరపాట్లతో పలువురికి కరెంట్ బిల్లులు

ఆన్ లైన్ చేసేటప్పుడు జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల జీరో బిల్ పొందడానికి అర్హులైన కూడా వారికి కరెంటు బిల్ వస్తుంది.

ఆన్ లైన్ చేసేటప్పుడు జరిగిన కొన్ని పొరపాట్లు సరిచేయడానికి ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో గృహజ్యోతి స్కీమ్ అందక కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండే వారు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడు ఈ స్కీంను పొందడం సమస్యగా మారింది.

ప్రజాపాలన దరఖాస్తులో ఏ మీటర్ నంబర్ అయితే రాశారో, అదే నంబర్కు జీరో బిల్ వర్తిస్తుందని, మీటర్ నంబర్ను మార్చుకునే ఆప్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో అద్దె ఇల్లు మారిన లబ్ధిదారుకు స్కీమ్ అందడం లేదు.

పాత ఇంటి మీటరునే గృహజ్యోతి వర్తిస్తుండడంతో ఇంటి ఓనర్ లబ్ధి పొందుతున్నారు. ఇక ప్రజాపాలన దరఖాస్తు చేసే సమయంలో జరిగిన పొరపాట్ల వల్ల మరికొంత మంది పథకానికి దూరమయ్యారు.

దీంతో ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే సమస్యకు పరిష్కారం అవుతుందని.. ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.