AP CM చంద్రబాబు కు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కు సెకండ్ హ్యాండ్ కారు వినియోగదారుల విన్నపం
ఆంధ్రప్రదేశ్ గతంలో వైయస్సార్ పార్టీ అధినేత జగన్ పారదర్శక పాలనను అందించాలని కారు ఉంటే రేషన్ కార్డు తో పాటు వివిధ పథకాలకు చరమగీతం పాడారు. సర్కారు ఏర్పడగానే కారు ఉంటే రేషన్ కార్డు గల్లంతుఅయిపోయింది.
కానీ పూర్తి వివరాల్లోకి వెళితే….
ఎటువంటి కారు ఉండాలో, కారు ఖరీదు, మోడల్ ని బట్టి, కొత్త కారికే రూల్స్ ఆ లేకపోతే పాత కారుకి రూల్స్ ఉన్నాయా అనేది తేల్చి చెప్పకుండానే ఒక పాత (సెకండ్ హ్యాండ్ )కారు లక్ష రూపాయల్లో కొని రిజిస్ట్రేషన్ చేపించారో లేదో రేషన్ కార్డు గల్లంతయిపోతుంది. ఆ తర్వాత లబోదిబోమని కొన్నది తొక్కలో కారు దానికి రేషన్ కార్డు పోగొట్టావని, ఈ కారు అమ్మే దగా వాడి దుంప తీస్తున్నారు. ఇప్పుడు మొదలైంది అసలు సిసలు పని…. కారు రిజిస్ట్రేషన్ ఎంత సింపుల్గా అయిందో….. అంతే కఠినంగా మారడం అంటే కష్టమే అనిపించింది. రిజిస్ట్రేషన్ అయిన అంత సులభంగా కారు వేరే వారికి అమ్మి వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా సరే మళ్లీ రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే కారు లేనట్టు సర్టిఫికెట్ అధికారులు అడిగారు. చాలామందికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో చాలామంది సెకండ్ హ్యాండ్ కారు జోలికి వెళ్లకుండా ఉన్నారు కూడా…. కొంతమంది ఇక్కడే కారు కొని తెలంగాణలో ఉన్న చుట్టాల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చింది…
మధ్యతరగతి వారు 1lk లక్ష 2 లక్షల కారు కొనుక్కొని పరిస్థితి లేకుండా పోయింది.
మధ్యతరగతి కారు వినియోగదారుల విన్నపం కార్ అంటే అందరికీ కారుతోనే సమానం కాకపోతే దాని విలువలను బట్టి కూడా కారు విలువ ఉంటుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా మళ్లీ సవరణలు చేసి కారున్న వారికి రేషన్ కార్డు పోకుండా మరియు పథకాలని ఇవ్వకుండా సెకండ్ హ్యాండ్ కారు ఉన్నవారికి అర్హులుగా సవరణలు చేసి కారు ఉంటే రేషన్ కార్డు ఇప్పించవలసిందిగా సెకండ్ హ్యాండ్ కారు వినియోగదారుల విన్నపం.