మహబూబాబాద్ లో పురుగులమందు తాగిన SI…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ ఐ శ్రీరాముల శ్రీను నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం.
పురుగులమందు త్రాగానని తానే స్వయంగా 108కు పోన్ చేసిన ఎస్ఐ శ్రీను..
సంఘటన స్థలానికి చేరుకొని ఎస్ఐ శ్రీను ను మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించిన డిఎస్పీ తిరుపతిరావు, సిఐలు సర్వయ్య, బాబురావు, 108 సిబ్బంది..
చికిత్స అనంతరం ఎస్ఐ పరిస్థితి విషమంగా ఉండడంతో అర్ధరాత్రి 12గంటల తర్వాత వరంగల్ ఆస్పత్రికి తరలింపు…
నల్లబెల్లి మండలం నారక్కపేట ఎస్ఐ శ్రీను స్వస్థలం
అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఐ శ్రీనుకు మద్య విబేధాలు.., ఎస్ఐ పై ఉన్నతాధికారులకు పిర్యాదు చేసిన సిబ్బంది..
అప్పటినుంచి ఎస్ఐ శ్రీను మనస్థాపంతో ఉన్నాడంటున్న కుటుంబసభ్యులు..