జగిత్యాలతో BRS జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

జగిత్యాలతో BRS జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది

ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ పార్టీ

2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసింది

అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్‌తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం

2015 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు

తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్‌ను పడగొట్టే ప్రయత్నం చేశారు

ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు

రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు

అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు

రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలె? ఎవరు పిచ్చి కుక్క?

ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్‌ను కొట్టాలా?

రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్

వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి

ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. రాహుల్ గాంధీ ఏమన్నాడో కూడా వినాలె

ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్‌లోనే చెప్పిండు

పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు

కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమెమిటీ ప్రజలు గుర్తించాలె

వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు

బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది

14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది

ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు ?

మోడీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు

దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది

ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఏ కూటమిలో లేని సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్‌లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక్కో అంశం అర్థమవుతోంది

రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్‌ను బద్నాం చేశాడు

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు

కానీ ఇప్పుడు అసలు విషయం తెలుస్తోంది.. ఓయూ విద్యార్థులు నిరసన మొదలుపెట్టారు

మోతీలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తుంటే పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టారు

ఈ ఆరు నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది.. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు

మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ గెలుస్తుంది

తెలంగాణ తెచ్చింది.. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్.. ఇది చరిత్ర.. ఈ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు

ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టే విధంగా హామీలు ఇవ్వటం కారణంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది

డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు.. ఏడు నెలలు అయ్యింది.. టైమ్‌పాస్ చేస్తున్నారు

వృద్ధులకు 4 వేలు, రైతులకు రైతు భరోసా రూ. 15,000, మహిళలకు రూ. 2,500 అంటూ నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు

ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు

వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు

అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు

ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు

ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ఖతం అయిపోయిందంటూ పుకార్లు పట్టిస్తున్నాడు. ఆయన మీడియాలో ఏదేదో కథనాలు రాయించుకుంటున్నాడు

కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవటం ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కడతారు

జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది.. జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు

కష్టాలు వచ్చినప్పుడే నాయకుల విలువ తెలుస్తుంది

జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా