ఈ బుల్లెట్ అంత బంగారమే… ధర ఎంతో తెలుసా…
సాధారణంగా మనం రోడ్లపై రకరకాల బైక్స్, బుల్లెట్లు చూస్తుంటాం. అయితే మీరు ఎప్పుడైన బంగారంతో నిండిన బుల్లెట్ చూశారా? అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే లేదనే చెబుతారు.
ఎందుకంటే…. బంగారం ధర చూస్తే ఆకాశానికి ఎక్కింది. ఇప్పుడు పదిగ్రాముల బంగారం 70వేలకు పైగానే ఉంది. దీంతో గోల్డ్ కొనాలంటేనే జనం భయపడుతున్నారు. అయితే అలాంటి సమయంలో మీకు మేం బంగారం బుల్లెట్‌ను చూపిస్తాం. ఆ బైక్ ఎక్కడో కాదు… పాట్నాలో చూడొచ్చు. పాట్నా రోడ్లపై గోల్డ్ బుల్లెట్ పరుగులు తీయడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. బంగారు వర్ణంలో మెరుస్తున్న ఈ బంగారు బుల్లెట్‌కు అన్ని లక్షణాలు ఉన్నాయి, అయితే దాని బాడీ అంతా 24 క్యారెట్ల బంగారం పూత పూయబడింది. దాదాపు 200 నుంచి 300 గ్రాముల బంగారంతో పూత బుల్లెట్‌కు పూశారు.దీని కోసం సుమారు రూ.13 నుంచి 14 లక్షలు ఖర్చు చేశారు.
బంగారంపై అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తి మాత్రమే ఈ పని చేయగలడు. బీహార్‌లో బంగారంపై తనకున్న ప్రేమను నేరుగా వ్యక్తపరిచే వ్యక్తి ఒక్కడే. అతడే.. బీహార్ గోల్డెన్ మ్యాన్ గా పేరొందిన ప్రేమ్ కుమార్ సింగ్ . బీహార్ బంగారు మనిషిగా ప్రసిద్ధి చెందిన ప్రేమ్ సింగ్‌కు గోల్డ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన నిత్యం తన ఒంటిపై కూడా 5 కిలోల 400 గ్రాముల బంగారం ధరిస్తాడు. ప్రేమ్ సింగ్ భోజ్‌పూర్ జిల్లా నివాసి. తనకు చిన్నప్పటి నుంచి బంగారం అంటే చాలా ఇష్టం. ఆరేళ్ల క్రితమే బంగారంపై మక్కువ ఎక్కువై ఒక్కటి కాదు ఏకంగా 5 కిలోల 200 గ్రాముల బంగారాన్ని ధరించి నడవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ సంఖ్య 5 కిలోల 400 గ్రాములుగా మారింది, మెడ చుట్టూ మందపాటి బంగారు గొలుసులు, అన్ని వేళ్లకు ఉంగరాలు, మణికట్టుపై కూడా నగలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రేమ్ సింగ్ సవారీ కూడా బంగారంగా మారింది. దాదాపు రూ.14 లక్షలు వెచ్చించి ప్రేమ్ సింగ్ గోల్డెన్ బుల్లెట్‌ను రెడీ చేశాడు.
అయితే బంగారంపై మోజుతో జీవించే ఈ శైలి ప్రేమ్ సింగ్‌ను అందరికంటే భిన్నంగా చేస్తుంది. 5 కోట్లకు పైగా విలువైన బంగారం ధరించి ప్రేమ్ సింగ్ కారు దిగగానే సెల్ఫీలు దిగేందుకు జనాలు కూడా ఇంట్రస్ట్ చూపిస్తారు. వృత్తిరీత్యా ప్రభుత్వ కాంట్రాక్టర్ అయిన ప్రేమ్ సింగ్… జమీందార్ కుటుంబంలో పుట్టాడు. మాట్లాడుతూ.. తాను ముందుగా 50 గ్రాముల బంగారం ధరించడం ప్రారంభించానని, అయితే చుక్కల కొద్దీ నీరు నిండి చెరువుగా మారినట్లు.. తన శరీరంపై బంగారం క్రమంగా పెరిగి నేడు 5 కిలోల 400 గ్రాములకు చేరుకుందని చెప్పారు.
లక్ష్యం 8 కేజీలు
తానే బీహార్‌కు చెందిన తొలి స్వర్ణమనిషి అని, దేశానికి రెండో గోల్డ్ మ్యాన్ అని ప్రేమ్ సింగ్ పేర్కొన్నాడు. మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి దాదాపు 7 నుంచి 8 కిలోల బంగారం ధరిస్తాడు. ఏదో ఒక రోజు రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి ఎదగాలన్నది తన లక్ష్యమన్నాడు ప్రేమ్ సింగ్. ఇందుకోసం బంగారం కొనుగోళ్లను నిరంతరం పెంచుతూనే ఉన్నామన్నాడు. ఇప్పుడు ప్రేమ్ సింగ్ తన బుల్లెట్ తర్వాత బంగారు తలపాగా, బంగారు కళ్లద్దాల తయారీ జరుగుతోంది.
తన ఈ అభిరుచిని నెరవేర్చుకోవడానికి తన సంపాదనలో ఎక్కువ భాగం బంగారంపై వెచ్చిస్తున్నానని, 8 కిలోల బంగారం ధరించి బీహార్ గోల్డ్ మ్యాన్‌గా, దేశానికి గోల్డ్ మ్యాన్‌గా ఎదగాలని తన టార్గెట్ అని గోల్డెన్ మ్యాన్ చెబుతున్నాడు. ఈ బంగారమంతా నిజాయితీగా సంపాదించినదేనని అన్నారు. ఇప్పుడు చాలా బంగారం ఉంది కాబట్టి భద్రతా కారణాల దృష్ట్యా తాను తనకు రక్షణగా నలుగురు బౌన్సర్లను కూడా నియమించుకున్నట్లు తెలిపారు.