ఖమ్మం లోని కేవీఆర్ అభయ హాస్పిటల్ నందు అత్యంత అరుదైన ఆపరేషన్

ఖమ్మం లోని కేవీఆర్ అభయ హాస్పిటల్ నందు అత్యంత అరుదైన ఆపరేషన్……

ఖమ్మం లోని కేవిఆర్ అభయ హాస్పిటల్ నందు అత్యంత అరుదైన క్లిష్టతరమైన ఆపరేషన్ జరిగింది.

భద్రాచలం కి చెందిన 5 సంవత్సరాల చిన్నారి పెన్ తో ఆడుకుంటూ కింద పడిపోయి పెన్ బ్రెయిన్ లోని గుచ్చుకుపోయి కొమా లో ఉండగా వారు ఖమ్మం లోని కేవిఆర్ అభయ హాస్పిటల్ కు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చారు.

చిన్నారిని పరిశీలించిన న్యూరో సర్జన్ డా. ఫరాజ్ ఆపరేషన్ చేసి ఆ పెన్ ను తొలగించొచ్చు అని తల్లిదండ్రులకు వారి బంధువులకు వివరించి దాదాపు 4 గంటల పాటు హాస్పిటల్ సిబ్బంది తో కలిసి శ్రమించి క్లిష్టతరమైన ఆపరేషన్ చేసి ఆ పెన్ ను తొలగించారు.

వైద్యులు మాట్లాడుతూ….

ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి అని ఆపరేషన్ విజయవంతంగా చేసి ఆ పెన్ ను తొలగించాం అని చిన్నారి కోలుకుంటుంది అని తెలిపారు. ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించినందుకు చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.