నీట్ పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల దేశవ్యాప్త కేజీ టు పీజీ విద్యాసంస్థల బందు విజయవంతం
నీట్ ఎగ్జామ్ ను రద్దుచేసి మళ్ళి నిర్వహించాలి
కేంద్ర విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి AISF.. SFI.. NSUI.. డిమాండ్
వామపక్ష విద్యార్థి సంఘాలు నీట్ పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఇచ్చిన దేశవ్యాప్త కేజీ టు పీజీ విద్యాసంస్థల బందు పిలుపులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు బంద్ చేయడం జరిగింది ఇకనైనా కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జాం రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అదేవిధంగా పేపర్ లీకులవు కారణమైన( ఎన్ టి ఏ ) సంస్థను రద్దు చేయాలి అదేవిధంగా తక్షణమే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు లేనియెడల మరోసారి విద్యార్థి లోకాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ లలో విచ్చలవిడిగా ఫీజులు పెంచి నిరుపేద కుటుంబాలని దోచుకుంటున్నారు దీనిపై వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.