జగిత్యాల జిల్లా… మహిళల భద్రత మరియు రక్షణకి షీ టీమ్స్ తో మరింత భరోసా

జగిత్యాల జిల్లా….

మహిళల భద్రత మరియు రక్షణకి షీ టీమ్స్ తో మరింత భరోసా…

నూతన చట్టాల పై విద్యార్థినులకు,మహిళలకు అవగాహన…

జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో , కాలేజ్ తాటిపల్లి లో షీ టీం, AHTU టీమ్, కళ బృందo వారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్బంగా CCS ఎస్. ఐ తిరుపతి గారు మాట్లాడుతూ …

జిల్లాలోని మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు. మహిళలు, బాలికల, విద్యార్థిని విద్యార్థుల రక్షణకు పోలీస్ శాఖ తరఫున షీ టీమ్, AHTU టీమ్ లు పనిచేస్తునయని అన్నరు . షీ టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని లేదా 8712670783 వాట్సప్ ద్వారా కూడా పిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు.జి ల్లా పరిధిలో పాఠశాలలు/కళాశాలలను విద్యార్థినులకు సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్,ఆకతాయిల వేధింపులను అరికట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న మహిళలు బాలికలు విద్యార్థిని విద్యార్థులు వెంటనే జిల్లా షీ టీం ఫోన్ నెంబర్ 8712670783 కి కాల్ చేసిన కాని, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి వెంటనే షీ టీమ్స్ సహాయం పొదలని తెలిపారు. మహిళలు, విద్యార్థినులు సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫొటో లు, వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసు కోవాలని సూచించారు. భారత దేశ వ్యాప్తంగా నూతన చట్టాలు అమలు చేయడం జరిగిందని మహిళలకు, పిల్లలకు నూతన చట్టాలు మరింత అండగా మరియు రక్షణగా నిలుస్తాయని తెలిపారు. నూతన చట్టాలలో నేరస్తులకు కఠిన శిక్షలు అమలు చేయడం జరుగుతుంది.

ఈ యొక్క కార్యక్రమంలో షి టీమ్ ASI వలి బేగ్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, షీ టీం మరియు భరోసా,AHTU , కళాబృందం సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.