ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన BRS పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందం

ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన BRS పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందం

బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన నాయకులు.

పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి,ఎమ్మెల్యే పల్లా, జడ్పీ చైర్మన్ కమల్ రాజు,ఎమ్మెల్సీ మధు,సండ్ర.

బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాలతో మృతి చెందిన రైతు బోజేడ్ల ప్రభాకర్ కుటుంబానికి న్యాయం జరగాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధి బృందం అన్నారు.

తొలుత జిల్లా పోలీస్ కమిషనర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం ప్రొద్దుటూరు గ్రామంలో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్ లో రైతు బోజేడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని మృతిని కుటుంబానికి సర్వత న్యాయం చేయాలని ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు.మేము వస్తాం అని తెలిసే వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే భట్టికి రావడానికి సమయం లేదు అని,మేము వస్తున్నాం కాబట్టి వచ్చాడు అని దుయ్యబట్టారు.

కనీసం బాధిత కుటుంబానికి సహాయం చేయాలి అనే ఇంగితజ్ఞానం కూడా భట్టి విక్రమార్క కు లేదు అని మండిపడ్డారు.ఈ జిల్లా లో ముగ్గురి మంత్రులలో ఒక్కరికి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి అని లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.భట్టి విక్రమార్క బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిందితుల ఇంటికి ఎలా వెళ్తారు అని ప్రశ్నించారు.

ఈ రాష్ట్ర ప్రతినిధుల బృందంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి,జడ్పీ చైర్మన్,నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజ్, MLC & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.