KCR సంచలన నిర్ణయం… ఇకనుండి BRS పార్టీలో యువతకు పెద్దపీట

KCR సంచలన నిర్ణయం… ఇకనుండి BRS పార్టీలో యువతకు పెద్దపీట…

ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నేతలకు పార్టీ భాద్యతలు… పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ప్రధాన పదవులు వారికే…

వివరాలలోకి వెళితే….

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈ ఏడాది జనవరిలో ఉమ్మడి జిల్లాలవారీగా విశ్లేషణ చేపట్టిన గులాబీ దళం.. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లోనూ ఓడి పోవడంపై లోతుగా విశ్లేషణ జరిపింది.

పార్టీ నాయకులు, కేడర్ తోపాటు వివిధ సంస్థలు, వర్గాల నుంచి అందిన నివేదికలు, సమాచారాన్ని క్రోడీకరించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొందరు కీలక నేతలతో సారాంశాన్ని పంచుకున్నారు.

దశాబ్దకాలంగా పార్టీ, పాలనాపరంగా దొర్లిన తప్పులు, పొరపాట్లకు సంబంధించి ఈ నివేదికల ద్వారా అనేక సూచనలు అందినట్లు సమాచారం.

మరోవైపు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకొనే మార్పులు, బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే కోణంలోనూ కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే లోతుగా చర్చించారు.

సంస్థాగతంగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన అధినేత కేసీఆర్.. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నేతలకు పార్టీ బాధ్యతలు.. పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ప్రధాన పదవులు వారికే..

ఉద్యమంలో అండగా నిలిచిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలతో తిరిగి దోస్తీకి కసరత్తు.. ఇప్పటికే కొందరితో సమావేశమై చర్చిస్తున్న పార్టీ కీలక నేతలు

దీనిపై వచ్చే నెలలో ఘనంగా పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించే యోచనలో కేసీఆర్.