యావర్ రోడ్ల విస్తరణకు త్వరలోనే చేపడతాం… మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్..
జగిత్యాల పట్టణ ప్రజల ఎన్నో యేండ్లగా అపరికృషితంగా ఉన్న యావర్ రోడ్డు విస్తరణతో పాటు జగిత్యాల పట్టణాన్ని ప్రజా ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధి చేపడతామని మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్పర్సన్ నివాసంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ..
రోడ్ల విస్తరణలో గృహ యజమానులు దుకాణ సముదాయాల యజమానుల స్థలం కోల్పోతున్న వారి పరస్పర అంగీకారంతో పరిహారం చెల్లిపులతో రోడ్లు విస్తరణ చేపడతామని తెలిపారు.
నూక పల్లి అర్బన్ హౌసింగ్ కాలనిలో 4000 ఇండ్లు నిరుపేదలకు వ్యక్తి గత ఇండ్లు మంజూరు చేశారని, ఇంకా అర్ధాంతరంగా నిలిచిపోయిన 1600 నిరుపేదల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలిసి వినతి పత్రాన్ని అందజేశారనీ పేర్కొన్నారు. అతి త్వరలోనే మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చెప్పట్టి, నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తామని తెలిపారు.
గత ప్రభుత్వం రోడ్డు విస్తరణకు కావాల్సిన నిధులు సమకూర్చకుండ కేవలం మాటలతో కాలం వెళ్లదీసిందని అన్నారు. దీంతో రోడ్డు విస్తరణ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే హయాంలో 4500 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చొరవతో యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడమని పట్టణ అభివృద్ధికి రూ.100కోట్లయినా కేటాయిస్తామనీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. బుదవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లురీ లక్ష్మణ్ జగిత్యాల యావ ర్ రోడ్డు విస్తరణ కు 100 కోట్లు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ని కలిసి వినతపత్రం అందజేశారనీ తెలిపారు.
జగిత్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే హయాంలో 4500 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు కావడం జరిగిందని, ఒకవైపు అభివృద్ధి మరోవైపు ప్రజా సంక్షేమం రెండు కండ్లు గా ప్రభుత్వం చూస్తుందన్నారు.
ప్రజా ప్రభుత్వం లో మెరుగైన పాలన ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో 10 యేండ్లు గా అపరికృషితంగా ఉన్న యావర్ రోడ్డు విస్తరణ అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు.
ఇటీవలే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి యావర్ రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు పంపారని, 100 కోట్లు బడ్జెట్ కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు సైతం వినతి పత్రం అందజేశామన్నారు.
ఈకార్యక్రమంలో..
ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మున్సిపల్ చైర్పర్సన్ అభినందనలు తెలిపారు.
ఈకార్యక్రమంలో.. మున్సిపల్ కౌన్సిలర్ కల్లపల్లి దుర్గయ్య, నక్క జీవన్, వల్లపు రేణుక మొగిలి , దాసరి లావణ్య ప్రవీణ్, ఆల్లె గంగాసాగర్, ఫార్విన్ సుల్తానా కమల్ గాజుల రాజేందర్, నాయకులు పాల్గొన్నారు.