నేడు రేపు HDFC బ్యాంకింగ్ సేవలు బంద్…?

నేడు రేపు HDFC బ్యాంకింగ్ సేవలు బంద్…?

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు HDFC బ్యాంకు జులై13వ తేదీన తమ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపింది.

కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకింగ్ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు ఈ అప్ గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈరోజు తెల్లవారుజామున ఉదయం 3గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు ఈ అప్ గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతుంది.

కాబట్టి ఈ సమయంలో ఖాతాదారులకు కొన్ని సర్వీ సులను అందుబాటులో ఉండవని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.

మనదేశంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుకు ఏకంగా 93.2 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. కాబట్టి ప్రతి రోజూ భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరుగుతుం టాయి. అయితే హెచ్ డీ ఎఫ్ సీ సిస్టమ్ అప్ గ్రేడ్ ప్రక్రియ అనేది సుమారు 13.30 గంటల పాటు కొనసాగుతుంది.

ఖాతాదారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తమ కస్టమర్లపై ప్రభావం తగ్గించేందుకు సెలవు రోజున అప్ గ్రేడింగ్ సిస్టమ్ ను చేపడుతున్నట్లు తెలిపింది..