మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ

మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ

మాహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైమీ ఫైనల్స్ గా భావిస్తున్న శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది.శాసనమండలి ఎన్నికల్లో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఓటు వేసినట్లు తెలుస్తోంది.

అధికార మహాయుతి కూటమి అభ్యర్థులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి ఎక్కువ మంది అభ్యర్థులను నిలబెట్టింది. దీంతో, అధికార కూటమి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేస్తారని భావించింది. కానీ, అనూహ్యంగా ఓట్లను కోల్పోయింది. మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగగా.. 9 చోట్ల మహాయుతి కూటమి విజయఢంకా మోగించింది.

ఐదు స్థానాల్లో బీజేపీ, చెరో రెండు స్థానాల్లో అజిత్ పవార్ ఎన్సీపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన గెలిచాయి. విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రే శివసేన చెరొక స్థానంలో నెగ్గాయి. అయితే పీజేంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (పీడబ్ల్యూపీ) తరఫున పోటీ చేసిన జయంత్ పాటిల్‌కు శరద్ పవార్ ఎన్సీపీ మద్దతు పలికింది. కాగా.. అనూహ్యంగా జయంత్ ఓడిపోయారు. తగినన్ని ఓట్లు రాకపోవడంతో జయంత్ పాటిల్ ఓడిపోయారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్

అధికార మహాయుతి నుండి ఓట్లు పొందవచ్చని ఇండియా కూటమి ఆశించింది. ప్రత్యేకించి అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన కొందరు శరద్ పవార్ వర్గంతో టచ్ లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. కానీ, ఈ ఫలితాలతో అవన్నీ అవాస్తవలని తెలుస్తోంది.

37 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్న కాంగ్రెస్ తన అభ్యర్థి ప్రద్యనా సతవ్‌కు 30 మొదటి ప్రాధాన్యత ఓట్లను కేటాయించింది. మిగిలిన ఏడు ఓట్లు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మిలింద్ నార్వేకర్ కు పడాల్సి ఉంది. అయితే, సతవ్ కు 25 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. నార్వేకర్ కు 22 ఓట్లు వచ్చాయి. దీంతో, కనీసం ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని తెలుస్తోంది.