రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్
43 వేల ఫేక్ డిగ్రీలు జారీ చేసినట్టు ప్రైవేటు యూనివర్సిటీపై ఆరోపణలు
ఆ ఫేక్ డిగ్రీలతోనే ఉద్యోగాలు పొందిన కొంత మంది అభ్యర్థులు
3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల నియామక ప్రక్రియపై దర్యాప్తు
జైపూర్, జూలై 12: రాజస్థాన్‌లో గుర్తింపు లేని ఓ ప్రైవేటు యూనివర్సిటీ 43 వేలకు పైగా ఫేక్ డిగ్రీ సర్టిపికెట్లు జారీచేసిందనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రాజస్థాన్ పోలీసు శాఖకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూపు(ఎస్‌వోజీ) దర్యాప్తు ప్రారంభించింది. చురు పట్టణంలోని ఓంప్రకాశ్ జోగేందర్ సింగ్(ఓపీజేఎస్) యూనివర్సిటీ 2013 నుంచి 43,409 మేర డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్టు జారీచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 2022 పిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్(పీటీఐ) పరీక్ష కోసం 1,300 మంది అభ్యర్థులు ఈ యూనివర్సిటీ మంజూరు చేసిన సర్టిఫికెట్లను సమర్పించిన నేపథ్యంలో అక్రమాల వ్యవహారం తెరపైకి వచ్చింది
3 లక్షల మంది సర్టిఫికెట్లపై దర్యాప్తు
ఫేక్ డిగ్రీల స్కామ్ నేపథ్యంలో గత ఐదేండ్లలో ఉద్యోగాలు పొందిన 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల నియామక ప్రక్రియపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది