తెలంగాణ మహిళలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు…?
హైదరాబాద్ :
తెలంగాణలోమహిళలకు ఉచిత బస్సు, జీరో కరెంటు బిల్లు, 500లకు వంటగ్యాస్ సిలిండర్ వంటి స్కీములను ఇప్పటికే పలువురు లబ్దిదా రులు అందుకుంటున్నారు. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు విజయవంతంగా అమలవుతోంది.
మహిళలు రూపాయి కూడా చెల్లించుకుండానే ఆధార్ కార్డు చూపిస్తూ జర్నీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజలకు మరో గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇళ్లపథకంపై తాజా అప్ డేట్ అందించింది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారు లకు గ్రామ సభలు నిర్వ హించి సెలక్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధిం చిన ఆదేశాలు రానున్నట్లు సమాచారం.
ఈ పథకం కింద తొలి దశలో సొంత స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తారు. రెండో దశలో లబ్దిదారులకు ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందిస్తారు. తొలిదశలో నియోజకవర్గా నికి 3500 ఇళ్లు చొప్పున మంజూరు చేస్తుంది.
ఇంటి నిర్మాణానికి లబ్ధి దారులకు రూ. 5లక్షల రూపాయలను మూడు విడతల్లో వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఏడాదికి రూ. 4.50లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలోనే వెల్లడిం చారు.
ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుమీదనే మంజూరు చేస్తామన్నారు. ఈ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్ లు మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు.
సొంతిళ్లు ఉండాలని ప్రతి పేదవాడికి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఇంది రమ్మ ఇళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇళ్లు లేని వారు దరఖాస్తు చేసుకోవ చ్చని అధికారులు తెలిపారు…