రేపటి తరం భవిష్యత్తు కోసం మొక్కలు నాటండి… మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ :
సమాజంలో రేపటి తరానికి కాలుష్యం రాకుండా ఉండడానికి మొక్కలు నాటాలని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
వాతావరణ కాలుష్య సమతుల్యత పాటించేలా కాలుష్య నియంత్రణ కాపాడాలంటే మొక్కలు నాటాలని, మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలని, అది మనలో అంశం కావా లని, ప్రభుత్వ మొక్కలు పంపిణీ చేస్తుందని, ఎన్ని చేసిన ప్రజల సహకారం కావాలన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ లో సోమవారం 75 వ వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒకప్పుడు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటా లని దివంగత కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ పిలుపు నిచ్చారని, ఇప్పుడు ప్రభు త్వం ఒక యుద్ధ ప్రతిపా దికన ఈ కార్యక్రమాన్ని తీసుకుందని అన్నారు.
పట్టణంలో ఇంటికి అవసర మైన పండ్ల మొక్కలు, ఇతర అవసరమైన 6 మొక్కలు లాంటివి ఇస్తామని అడిషనల్ కలెక్టర్ చెప్పారని, అధికారులు ఇంటింటికి వస్తారని, ప్రతి ఒక్కరూ ఆ మొక్కను నాటి కాపాడేలా బాధ్యత తీసుకో వాలిని పొన్నం ప్రభాకర్ సూచించారు.
కరీంనగర్ జిల్లాలో 43 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు నిచ్చారు…