కాటారం మండలం బూడిద పల్లి లో… దారుణం

కాటారం మండలం బూడిద పల్లి లో… దారుణం

పోలీస్ డిపార్ట్మెంట్ పైన అపారమైన గౌరవం ఉంది, కొంతమంది అధికారుల నిర్లక్ష్యము, మూలంగా డిపార్ట్మెంట్ బదనమవుతుంది,

కాటారం సబ్ డివిజనల్ పోలీస్ పరిధి లోని, కాలేశ్వరంలో ఇటీవల దళిత కులానికి చెందిన, ఒక లేడీ కానిస్టేబుల్,ను, అదే టౌన్ లో ఎస్సై గా విధులు నిర్వహించిన ఎస్సై పిస్తలతో బెదిరించి, అత్యాచారం చేసిన ఘటన, మరువక ముందే దళిత కులానికి చెందిన ఒక నిరుపేద 65 సంవత్సరాల వ్యక్తిపై దారుణం,,,,

ఎస్సీ మాదిగ కులానికి చెందిన 65 సంవత్సరాల వృద్ధుడు (కలువల బాలాజీ) నీ,,, బీసీ కులానికి చెందిన కొంతమంది, 15,07,2024 న రాత్రి ఇంటిపై దాడి చేసి
మాదిగ లంజా కొడకా అంటూ కులం పేరుతో కొట్టి తిట్టి ఇల్లు కూల్చివేత (రేకుల షెడ్డు)

ఆడవారిని వృద్ధురాలు అని కూడా చూడకుండా వెనుకకు చేతులు విరిచి కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి,, కొట్టిన దారుణ ఘటన, కత్తితో కాలుపై పొడిచిన దుండగులు,

కాటారం పోలీస్ స్టేషన్లో ఉదయం నుండి సాయంత్రం వరకు బాధితుడు తనకు జరిగిన, దారుణ ఘటన గురించి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళితే, డి.ఎస్.పి గారు, ఎస్సై గారికి ఇవ్వండి అనడం, ఎస్సై గారు, సిఐ గారికి ఇవ్వండని అనడం, చివరికి స్టేషన్లోనే అధికారులు లేరంటూ,, బాధితున్ని వెళ్ళగొట్టిన దారుణ ఘటన

ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి ఇల్లు (రేకుల షెడ్డు), కూల్చివేసి కులం పేరుతో తిడుతూ, కొట్టిన ఘటనలో, కేసు నమోదు చేయవలసి ఉన్నప్పటికీ, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితుడు కన్నీరు మున్నూరుగా ఏడ్చాడు

విచిత్రం ఏమిటంటే కలువల బాలాజీ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని,

ఒక విలేఖరి ప్రోత్బలంతోటే వృద్ధుడైన కలువల బాలాజీ కేసుపట్ల, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది

విలేఖరి పనిచేసే పత్రిక యాజమాన్యాన్ని కూడా విలేకరిపై ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం,

ఈ విషయమై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం,

అన్ని దళిత సంఘాలను కలుపుకొని, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు, శ్రీ వడ్డేపల్లి రామచంద్ర గారికి, రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు, శ్రీ కొంకటి లక్ష్మీనారాయణ గారికి, శ్రీ రేణిగుంట్ల ప్రవీణ్ గారికి, మల్టీ జోన్, ఐ జి, గారికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం,

మంత్రి శ్రీధర్ బాబు గారి,దృష్టికి కూడా జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు దళిత సంఘాలు నిర్ణయం,

బొంకూరి మధు సీనియర్ జర్నలిస్టు,

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, (గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ)

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 9908333039