జగిత్యాల నియోజకవర్గ ఆలయాలకు TTD అభివృద్ధి నిధులు మంజూరు

జగిత్యాల నియోజకవర్గ ఆలయాలకు TTD అభివృద్ధి నిధులు మంజూరు..

ఒక్కో ఆలయ ధ్యాన మందిరం కోసం10 లక్షల చొప్పున 90 లక్షలు మంజూరు

అన్నదాతకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చరిత్రాత్మక నిర్ణయం….

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

ఎమ్మెల్యే మాట్లాడుతూ…

తొలి ఏకాదశి సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ హిందూ బందువులకు మంచి శుభవార్త

జగిత్యాల ప్రాంతములోని 9 ఆలయాలకు ఒక్కో ఆలయానికి 10 లక్షల చొప్పున 90 లక్షలు నిదులు మంజూరు చేసిన టి టీ డీ .
టి టి డి ఛైర్మెన్, ధర్మకర్తలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు…

జగిత్యాల పట్టణం లో శ్రీరామ్ మందిరం,బ్రాహ్మణ వాడ.శ్రీ గుట్ట రాజేశ్వర దేవస్థానం జగిత్యాల,శ్రీ వేంకటేశ్వర దేవస్థానం అంబారిపేట్,శ్రీ కోదండ రామాలయం ధరూర్ క్యాంప్,బీరప్ప దేవాలయం జగిత్యాల,శ్రీ హనుమాన్ దేవాలయం తిప్పన్న పెట్,శ్రీ హనుమాన్ దేవాలయం, సింగరావు పెట్,శ్రీ హనుమాన్ దేవాలయం రాయికల్,శ్రీ రాజ రాజేశ్వర నాగాలయం కొత్త పెట్ లకు ధ్యాన మందిరం,ప్రహారి గోడ,ప్రధాన ద్వారం గేట్ నిమిత్తం నిదులు మంజూరు అయ్యాయి.

జగిత్యాల నియోజకవర్గం లో ఇది వరకే ఆలయాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయటం జరిగింది అని ,పనులు కూడా పూర్తి అయ్యాయని గుర్తు చేశారు.

బీర్ పూర్ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయ అభివృద్ధికి గతం లో 30 లక్షల నిధులు మంజూరు చేయగా పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు.

శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామీ ఆలయం అభివృద్ది కి సైతం 80 లక్షలు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు.

అంతర్గం గ్రామంలో హనుమాన్ ఆలయ అభివృద్ధికి,నియోజకవర్గం లో ఇతర ఆలయాల అభివృద్ధికి నిధులు కోసం దేవాదాయ శాఖ మంత్రి గారిని కలిసి విన్నవించడం జరిగింది అని అన్నారు.

మన దేశానికి రైతే వెన్నెముక రైతు పక్షపాతి,రైతు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతన్న అప్పుల పాలు కాకూడదు అని రుణ మాఫీ అమలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణ మాఫీ అనేది హర్షణీయం…

ఏకకాలం లో అమలు చేయటం అనేది చరిత్రాత్మకం అన్నారు.

రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,కౌన్సిలర్ లు కోరే గంగ మల్లు, కుసరి అనిల్,కూతురు రాజేష్,వొద్ది శ్రీలత రామ్మోహన్ రావు,నాయకులు తక్కురి మల్లేశం,రఘు పతి,రాజన్న,సురేష్ రెడ్డి,రాజు,తదితరులు పాల్గొన్నారు.