నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు… జిల్లాలకు రెడ్ అలర్ట్
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిం ది. శుక్రవారం 4 జిల్లాల్లో, శనివారం 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 20వ తేదీన కుము రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.
ఇవేకాకుండా మరో 6 జిల్లా ల్లోనూ భారీ వర్షాలు కురు స్తాయని తెలిపింది. ఆయా సమయాల్లో ఒకేసారి వరద ముంచుకురావడం, రోల్డు, లోలెవల్ వంతెనలు మునిగి పోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవిం చే ఛాన్స్ ఉందని తెలిపింది.