బ్లాక్ మెయిల్ చేస్తున్న కాయితి శంకర్ పై చర్యలు తీసుకోవాలి… జిల్లా కలెక్టర్ సత్య ప్రకాష్ కు ANM మమత వినతి
సెలవులో ఉన్న గైర్హాజరు అంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మమత మండిపాటు
జగిత్యాల :
సెలవుల్లో ఉన్నా విధులకు గైర్హాజరు అయ్యారని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పత్రిక విలేఖరీ అంటూ బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా, డబ్బులు డిమాండ్ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్న కాయితి శంకర్ పై కఠిన చర్యలు తీసుకోవాలనీ రెండవ ఏఎన్ఎం ల సంఘము రాష్ట్ర అధ్యక్షురాలు పడాల మమత జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను కోరారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తిప్పన్నపేట సబ్ సెంటర్లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న పడాల మమత నుపత్రిక విలేకరి అంటూ కాయితి శంకర్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తూన్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు మమత ఈమేరకు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం పడాల మమత మాట్లాడుతూ కుటుంబ అవసరాల నిమిత్తం ఈనెల 9 నుండి 13 వరకు ఉన్నత అధికారుల నుండి నేను అధికారికంగా సెలవులు పొందిఉన్నానని తెలిపారు. కానీ కాయితి శంకర్ అనే వ్యక్తి కావాలనే ఈనెల 10న నేను విధుల్లో లేనంటూ తప్పుడు పత్రిక ప్రకటనలు ఇచ్చారని పేర్కొన్నారు. కాయితి శంకర్ గతంలో తాను విలేకరీనీ అంటూ 50 వేల రూపాయలు ఇవ్వాలనీ డిమాండ్ చేశారని, ఇవ్వకుంటే ఏదో ఒకరోజు నీ అంతూ చూస్తానంటూ బెదిరించాడనీ మమత ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నట్లుగానే తనపై తప్పుడు ప్రకటనలు జారీ చేసి హక్కులకు భంగం కలిగించారనీ ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఉన్నత అధికారుల నుండి తనకు జారీ చేసిన మెమో తనకు చేరకముందే కాయితి శంకర్ కు చేరిందనీ,దాన్నీ కాయితి శంకర్ తన వాట్సప్ స్టేటస్ పెట్టి తనను మరింతగా మానసిక ఇబ్బందులకు చేశారనీ ఆవేదన వ్యక్తంచేశారు.
కాయితి శంకర్ కి నా వ్యక్తిగత మెమో చేరడానికి కారణమైన మండల వైద్యాధికారి డాక్టర్ రవి శంకర్ పై సైతం చర్యలు తీసుకోవాలని ఆమే డిమాండ్ చేశారు. మెమో జారీ విషయం ఉన్నత అధికారులకు , సబంధిత ఉద్యోగికి మాత్రమే తెలిసి ఉండాలనీ, అది ఉద్యోగ చట్టంలో సుస్పష్టంగా ఉందనీ, ఒకవేళ అట్టి విషయాన్ని బహిర్గతం చేస్తే నేరం చేసినట్లు పరిగణలోకి తీసుకోవచ్చన్నారు.
తన మెమో విషయంలో కాయితి శంకర్, వైద్యాధికారి రవి శంకర్ నేరం చేశారనీ కాబట్టి ఇరువురుపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారని వివరించారు. తన హక్కులకు భంగం కల్గించిన కాయితి శంకర్ పై పరువు నష్టం కేసు వేయనున్నట్లు మమత స్పష్టం చేశారు. దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు మమత తెలిపారు.