రుణమాఫీలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ గోల్ మాల్…!!
తొలి విడత రుణమాఫీలో భాగంగా రూ.లక్ష లోపు తీసుకున్న లోన్లనే సర్కార్ మాఫీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకే గురువారం రైతుల ఖాతాల్లోకి సర్కార్ డబ్బు జమ చేసింది. సర్కార్ విడుదల చేసిన జాబితాలో కూడా తమ పేర్లు లేవని వాపోతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సహకార బ్యాంకుల్లో 1407 మంది రైతులు రూ.లక్ష లోపు రుణాలు తీసుకోగా.. వీరిలో ఒక్కరికీ కూడా రుణమాఫీ జరగలేదు. దీంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కారేపలి సహకార బ్యాంకులో 3790 మంది రుణం తీసుకోగా.. 668 మందికి మాత్రమే మాఫీ అయిందని బ్యాంకు అధికారులు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి సహకార బ్యాంకు పరిధిలో 756 మంది లోన్ తీసుకోగా.. ఇందులో కేవలం 388 మంది రుణమాఫీ అయింది.
నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,76,683 మంది లక్ష లోపు రుణాలు ఉండగా అందులో సగం మందికే మాఫీ అయినట్లు తెలుస్తోంది.
మెదక్ డీసీసీబీ పాపన్న పేట వద్ద 1685 మంది లక్ష లోపు రుణాలు తీసుకోగా.. వారిలో 845 మందికి మాత్రమే రుణమాఫీ అయింది.
వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో డీసీసీబీ పరిధిలో 1,43,327 మంది పంట కోసం రుణం తీసుకున్న వారు ఉండగా.. 37,625 మందికి మాత్రమే రుణమాఫీ అయిందని అధికారులు వెల్లడించారు.
నేలకొండపల్లి మండల పరిధిలోని బోదులబండ సహకార బ్యాంకుల్లో 865 మంది రుణం తీసుకోగా.. కేవలం 352 మందికి మాత్రమే రుణమాఫీ అయింది.