జగిత్యాల జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కు ఆరెంజ్ అలర్ట్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జగిత్యాల జిల్లా…

భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కు ఆరెంజ్ అలర్ట్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చెరువులు, వాగుల వద్దకు వెళ్ళద్దు… జిల్లా SP అశోక్ కుమార్ IPS

ప్రస్తుతం కూరుస్తున వర్షాలు దృష్ట్యా వాతావరణ శాఖ వారు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గారు సూచించారు.

టెలికాన్ఫెరెన్స్ ద్వారా జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అప్రమత్తం చేశారు. వర్ష సూచన ఉన్న దృష్ట్యా వాగులు పొంగిపొర్లి చెరువులు కుంటలు నిండుకుండ లాగా ఉన్నాయీ కావున ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలు వద్దకు పిల్లలు,యువత ఎవరూ చెరువుల వైపు వెళ్ళొద్దు అని అన్నారు.

చెరువుల వద్ద మరియు వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. వర్షానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంటుందని అందులో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం కు డయల్ 100 సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసు అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు,కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని సూచించారు. వర్షాల దృష్ట కరెంటు స్తంభాల దగ్గర కు ఎవరు వెళ్లకూడద అన్నారు.