జగిత్యాల జిల్లాలో మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి

జగిత్యాల జిల్లా..

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.

డ్రగ్స్, గంజాయి నివారణలో యువత భాగస్వాములు కావాలి.

గంజాయి రహిత జిల్లాగా మార్చడమే మా లక్ష్యం…  జిల్లా SP అశోక్ కుమార్ IPS.

జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే మిషన్ పరివర్తన కార్యక్రమం లో బాగంగా ఈ రోజు మెట్ పల్లి లోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా SP గారు మాట్లాడుతూ….

సమాజం నుంచి యువత మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు, అలవాట్లపై, ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోకూడదని సూచించారు. యువత పైనే దేశ బావిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. మత్తు పదార్థాలకు మానసికగా బానిస కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉంది అని అన్నారు. అనుకోకుండా ఏదైనా క్రైం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ 1985 ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. చట్టాలు బలంగా ఉన్నాయని తర్వాత బాధపడి లాభం లేదని అన్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు సమాచార వ్యవస్థను మరింత భలోపేతం చేస్తున్నట్లు తెలీపరు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించిన సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తునట్లు తెలిపారు. పల్లెల్లో ర్యాలీలు, సదస్సులు నిర్వహించి డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘాతో అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.

ఈ సందర్భంగా మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి విద్యార్థులకు వీడియోల ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. డ్రగ్స్ నివారణలో యువత యొక్క పాత్ర పై ఎస్పీ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విద్యార్థిని, విద్యార్థులకు ఎస్పీ గారు బహుమతులు ప్రధానం చేశారు.

ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి ఉమ మహేశ్వర రావు, సి. ఐ లు నిరంజన్ రెడ్డి, ఎస్.ఐ లు చిరంజీవి,అనిల్, కిరణ్ కుమార్, నవీన్, శ్యామ్ రాజ్ కళాశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.