వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా కరెంట్ వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలు
1.తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.
2.విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.
3.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత సిబ్బందికి తెలియచేయవలెను.
4.పార్కులలో గాని గ్రౌండ్ లో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.
5.క్లాస్ రూంలో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు.
6.బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.
7.కరెంటుకు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.
8. ఎవరు కూడ కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.
9.ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.
10.గాలి, దుమారం, వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.
11.కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు.
12.ఇంటి లోనికి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో సంబంధించిన సిబ్బంది దృష్టికి తీసుకెల్లాలి.
సదా మీ సేవలో… విద్యుత్ శాఖ