రికార్డుల నిర్మలమ్మ సీతారామన్ సైతం సరికొత్త చరిత్ర

న్యూఢిల్లీ :

వరుసగా ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ద్వారా నెహ్రు రికార్డును సమం చేశారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. వరుసగా ఆమె ఏడోసార్లు బడ్జెట్‌ను నేరుగా సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో గతంలో వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలమ్మ అధిగమించబోతున్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో రోజు.. అంటే మంగళవారం జులై 23న లోక్‌సభలో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. 2019లో ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో సారి బాధ్యతలు చేపట్టారు. ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామాన్ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు వరుసగా ఆమె ఆరు బడ్జెట్‌లను ఆమె ప్రవేశపెట్టారు.

అయితే ఈ ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల జరిగాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో నిర్మల మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం విధితమే. అయితే 1959 నుంచి 1964 మధ్య మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరు సార్లు కేంద్ర బడ్జెట్‌ను నేరుగా సభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఎన్నికలు జరగడంతో.. మోదీ ప్రభుత్వం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.