కరీంనగర్ తన నివాసంలో ప్రెస్ మీట్ లో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…!
కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు.. నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ!
మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది..! కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ, వందల కొద్ది యూట్యూబ్ ఛానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేసినా..! వాళ్ళ కుల్లును, కుతంత్రాలును కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుంది..!
తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలని చూసి ఓర్వలేని సన్నాసులు ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార.. సజీవ జలధార..!
ప్రస్తుతం..! మేడిగడ్డ బ్యారేజీ.! ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో సమాచారం…!
మొత్తం ఇన్ఫ్లో వచ్చేసి 8 లక్షల 20 వేల క్యూసెక్కులు..! అవుట్ ఫ్లో వచ్చేసి 8 లక్షల 20 క్యూసెక్కులు….! 85 గేట్లు ఉంటే 85 గేట్ల నుండి అన్ని నీళ్ళు క్రిందికి పారుతున్నాయి..! 6 రోజుల్లో 73 TMC లు సముద్రం పాలు..!
7 వ బ్లాక్ లోని 20, 21, పిల్లర్ లు సురక్షితంగా ఉన్నాయి…!
కాంగ్రెస్ పార్టీ వింత వాదన..! మేడిగడ్డ గేట్లు మూస్తే నే ప్రాజెక్టు గురించి తెలుస్తుందని..!
నీళ్ళ ఉదృతిని బట్టి గెట్లు తెరవడం కాని, మూయడం కాని జరుగుతుంది…! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, లు ఎవరో చెబితే గేట్లు తెరవడం కాని, మూయడం కాని జరగదు…! అది నీళ్ళ యొక్క వరద మీద ఆధారపడి ఉంటుంది..!
బ్యారేజి కి ఆనకట్ట కు మధ్య తేడా:
బ్యారేజ్: బ్యారేజ్ అనేది నీటి ప్రవాహాన్ని మళ్లించడానికి సాధారణంగా నిర్మించబడిన ఒక రకమైన ఆనకట్ట, నీటి స్థాయిలను నియంత్రిస్తుంది…! ఇది తరచుగా దిగువ నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి తెరవగల లేదా మూసివేయబడే ద్వారాలను కలిగి ఉంటుంది..!
ఆనకట్ట: ఆనకట్ట అనేది ఒక నది లేదా ప్రవాహానికి అడ్డంగా నిర్మించబడిన ఒక అవరోధం, ఇది ఒక జలాశయాన్ని సృష్టిస్తుంది..! ఆనకట్టలు ప్రధానంగా నీటి నిల్వ, జలవిద్యుత్ ఉత్పత్తి, నీటిపారుదల మరియు వరద నియంత్రణ కోసం నిర్మించబడ్డాయి..!
ఈ అసమర్థ కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులో నీళ్లు లేనప్పుడు మరమ్మత్తులు మరచి, ఈరోజు ప్రాజెక్టు యొక్క నాణ్యత గురించి మాట్లాడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది…!
రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి..
ఎండాకాలంలో ఏ బస్సులైతే ఏసుకుని మీరూ,మీ సహచర మంత్రివర్గం కాళేశ్వర కూల్చే యాత్రకు పోయిర్రో..! అదే మంత్రి వర్గం మల్లీ అవే బస్సులేసికుని నేడు ఒక పర్యటన చేపట్టి కాళేశ్వర ప్రాజెక్ట్ నేటి పరిస్థితిని సందర్శించవలసిందిగా మనవి..!
అబద్దాలు చెప్పిన పాపానికి ఆ కాళేశ్వర గోదారమ్మ నీళ్ళు నెత్తిన చల్లుకుని వస్తే కొద్దిలో కొద్దిగా పాప ప్రాయశ్చిత్తమైన కలుగుతుందని మా వినమ్ర విజ్ఞాపన..!
కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం..!
కాళేశ్వరం అంటే…
3 బ్యారేజీలు
15 రిజర్వాయర్లు
19 సబ్ స్టేషన్లు
21 పంప్ హౌజులు
203 కిలోమీటర్ల సొరంగాలు
1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్
98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్
141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ
530 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయడం
240 టిఎంసీల ఉపయోగం…
బ్యారేజి కి గాను చేసిన 3600 కోట్ల ఖర్చు..
గ్రౌండ్లో వాటర్ 600 నుండి 800 ఫీట్లకు దిగిపోయిందని స్వయంగా రైతులు చెబుతున్న మాట…
కెసిఆర్ పై కోపంతో రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం…
కాళేశ్వరం కి చేసిన ఖర్చు 83 వేల కోట్లు..
దీని ఆయకట్టు 45 లక్షల ఎకరాలు…
సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం..!
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్…!
గోదావరి నుంచి 170 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యం…! ఈ ప్రాజెక్ట్ తో తెలంగాణలోని 13 జిల్లాలకు లబ్ధి…! భారీ ఎత్తిపోతల పథకంలో 28 ప్యాకేజీ ద్వారా పనులు..! ఇందులో హైదరాబాద్‌కు10 టీఎంసీల తాగునీరు కోసం 7 మెగా లింకులు ఏర్పాటు…
ఎక్కడా నిర్మించని విధంగా 532 మీటర్ల ఎత్తుకు రెండు దశల్లో ఎత్తుకు నీటి పంపింగ్…!
టన్నెల్స్, పైపులైన్లతో కలిపి 1850 కిలోమీటర్ల నీటి సరఫరా నిర్మాణాలు…