మట్టిపనీకైనా ఇంటోడే ఉండాలి…  పార్లమెంటులో తెలంగాణ వాదుల ప్రాతినిధ్యం అవశ్యం… సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి

మట్టిపనీకైనా ఇంటోడే ఉండాలి…  పార్లమెంటులో తెలంగాణ వాదుల ప్రాతినిధ్యం అవశ్యం… సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి.

పార్లమెంటులో తెలంగాణ వాదుల ప్రాతినిధ్యం ఉండడం ఆవశ్యకం.

పార్లమెంటులో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉండడం వల్ల తెలంగాణకు ఏం న్యాయం జరిగింది ?

400 సీట్లు గెలుస్తామన్న బీజేపీ చివరకు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారం దక్కించుకుంది

ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారం దక్కుతుందనుకున్న కాంగ్రెస్ అందనంత దూరంలో ఆగిపోయింది

అధికారం నిలబెట్టుకోవడానికి బీజేపీ ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలకు బడ్జెట్లో వరాలు కురిపించింది

ఆంధ్రాకు నిధులు దక్కడం ఆహ్వానించదగ్గ పరిణామమే .. సంతోషకరమే

మరి తెలంగాణలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి ఏం లాభం ?

అందుకే తెలంగాణ అస్తిత్వం ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని ప్రజలను కోరింది.

ప్రాంతీయ పార్టీలతో ఏం పని అని జాతీయపార్టీలు ఎన్నికల్లో చెబుతున్నాయి.

అవే ప్రాంతీయ పార్టీలను బతిమాలి పొత్తు పెట్టుకుని జాతీయ పార్టీలు అధికారంలోకి ఎందుకు వస్తున్నాయి ?

ప్రాంతీయ పార్టీలకు జాతీయ ఎన్నికల్లో ఏం పని అంటున్న కాంగ్రెస్, బీజేపీలకు గ్రామస్థాయి సర్పంచ్, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు ?

అందుకే జాతీయ పార్టీల వాదన పిచ్చి వాదన .. ఆయా రాష్ట్రాల అవసరాలు ప్రత్యేకంగా ఉంటాయి .. అక్కడి అవసరాలు ఏంటి అని ఆయా రాష్ట్రాల ఎంపీలు కొట్లాడి నిధులు తీసుకువస్తారు అని అంటున్నాం.

లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో మిత్రపక్షంలో ఉన్న వారు తీసుకువస్తారు.

అందుకే తెలంగాణ ఎంపీలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉండాలని మొత్తుకున్నాం.

జాతీయ పార్టీలతో ఎన్నడూ రాష్ట్రాలకు ప్రయోజనం ఉండదు .. ప్రాంతీయ పార్టీలే శ్రీరామరక్ష.

బడ్జెట్లో తెలంగాణను విస్మరించడం కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఎంపీల వైఫల్యానికి నిదర్శం.

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించక పోవడంపై ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.