భట్టి బడ్జెట్ కేవలం ఉట్టి బడ్జెట్ మాత్రమే… సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు
హైదరాబాద్ :
ఈరోజు వార్షిక బడ్జెట్ ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు శాసన సభలో ప్రవేశపెట్టిన తదనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భట్టి బడ్జెట్ కేవలం ఉట్టి బడ్జెట్ గా ఉన్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతూనే రూ.30 వేల కోట్లు రీజల్ రింగ్ రోడ్డు కు ఇచ్చిందని మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీ (IIHT ) మంజూరు చేసిందని బడ్జెట్ ప్రసంగంలో తెలపడం విచిత్రంగా ఉందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని పక్షంలో ఒక్కరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని విమర్శించారు.
కేవలం బడ్జెట్ కేటాయింపులు చేస్తూ నిజంగా ఖర్చు పెట్టే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, పూర్తిగా ఆర్థిక పరిస్థితులు నానాటికి తీసికట్టుగా తయారయ్యిందని విమర్శించారు.
బడ్జెట్ చర్చ సందర్భంగా ఈ విషయాలని ఉటంకిస్తూ ప్రజలకు వాస్తవాలను తెలియపరుస్తామని అన్నారు.
ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, పాయల శంకర్ పాల్గొన్నారు.