భార్యను చూడటానికి బస్సునే ఎత్తుకెళ్ళిన ఘనుడు…!!

భార్యను చూడటానికి బస్సునే ఎత్తుకెళ్ళిన ఘనుడు…!!

ఆత్మకూరు డిపో నుండి తెల్లవారుజామున తెచ్చానని ఒప్పుకున్న దరగయ్య.

ముచ్చుమర్రిలో బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు.

భార్యను చూద్దామని బస్సు తెచ్చానని పోలీసులకు చెప్పిన ఘనుడు.

నందికొట్కూరు :

భార్యను చూడటానికి ఏకంగా ఏపి ఎస్ ఆర్టీసి బస్సునే తెచ్చాడు ఓ ఘనుడు. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆపి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నా భార్య ఇదే గ్రామంలో ఉంది. నా భార్యను చూసేందుకు ఏమి లేకపోవడంతో బస్టాండ్ లో బస్సు ఉందని, తలాలూ బస్సుకే ఉండటంతో బస్సును తెచ్చుకున్నానని పోలీసులకు సమాధానం ఇచ్చారు అతను. ఈ సంఘటన పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో చోటుచేసుకుంది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం …

ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దరగయ్య అనే వ్యక్తికి ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయ్యింది. వృత్తి రీత్యా దరగయ్య డ్రైవర్ గా పని చేస్తున్నారు. అయితే ఇతనికి మతి స్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు, అతని బంధువులు తెలిపారు. గత కొన్నిబరోజులుగా భార్య ముచ్చుమర్రి గ్రామంలో ఉండటంతో దరగయ్య భార్యను చూడాలని అనుకొని తెల్లవారుజామున ఆత్మకూరు బస్టాండ్ వద్దకు వచ్చాడు.

అతను ముచ్చుమర్రి కి వెళ్లేందుకు ఏమి లేవని బస్టాండ్ లో బస్సును ఎక్కి చూడగా బస్సుకే తాళాలు ఉండటం చూసి బస్సును తీసుకెళ్ళి చూసొద్దామని బస్సు ఎత్తుకెళ్లాడు ఆ ఘనుడు. ఆత్మకూరు డిపోలో డ్రైవర్ వచ్చి బస్సు చూడగా కనిపించకపోవడంతో బస్సు లేదని ఆత్మకూరు డిపో అధికారులకు తెలిపారు.

వెంటనే బస్సు ఎటువెళ్లిందని సీసీ కెమెరాలు పరిశీలించగా బస్సు నందికొట్కూరు వైపు వెళ్లిందని తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. ముచ్చుమర్రి వైపు బస్సు వెళ్లిందని తెలిసి ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ కు ఆర్థిసి అధికారులు పిర్యాదు చేశారు.

ముచ్చుమర్రి ఏ ఎస్ ఐ కృష్ణుడు బస్సును ఆపి దరగయ్యను అదుపులోకి తీసుకుని, బస్సును స్వాధీనం చేసుకున్నారు. దరగయ్యను విచారించగా భార్యను చూసేందుకు బస్సు తెచ్చానని ఒప్పుకున్నట్లు తెలిపారన్నారు.

బస్సును ఆత్మకూరు డిపో వారికి అప్పగించినట్లు ఏ ఎస్ ఐ కృష్ణుడు తెలిపారు.. దరగయ్యను మతి స్థిమితం సరిగ్గా లేకపోయినప్పటికీ బస్సును ఎక్కడ ప్రమాదానికి గురికాకుండా ముచ్చుమర్రి కి తీసుకురావడం విశేషం.. ఏది ఏమైనప్పటికి ఆత్మకూరు డిపోలో బస్సు కే తాళాలు పెట్టడం అక్కడ పని చేస్తున్న డ్రైవర్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు.