అసెంబ్లీ లో స్మార్ట్ మీటర్ల పై CM రేవంత్ రెడ్డి గారి అసత్యాలపై స్పందించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
వ్యవసాయ మోటర్లకు మీటర్ల గురించి రేవంత్ చెప్పిన అసత్యాలే..!
స్మార్ట్ మీటర్ల ఒప్పందం తో విద్యుత్ వినియోగదారునికి గుదిబండ గా మారనున్నది…!
గతం నుంచి కెసిఆర్ గారు చెబుతూనే ఉన్నారు. కేంద్రంతో ఒప్పందం కుదిరింది..కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మోటార్ల కు మీటర్లు పెడతారని, ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అది ఇప్పుడు నిజం అవబోతోంది…!
గతంలో ఆర్థికంగా రూ. 30 వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ కేంద్రం తెచ్చిన రైతు కంటక ప్రతిపాదనని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది..!
FRBM రాయితీ తీసుకువస్తే ఈ ఒప్పందం ద్వారా 30 వేల కోట్లు అప్పు కు తీసుకోడానికి అనుమతి కి, డిల్లీ లో అగ్రిమెంట్ చేసుకుని వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,..! ఒక్క మాటలో చెప్పాలంటే రైతాంగాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్నలాంటి వారని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు..! ఇక్కడే అర్థం అవుతుంది కాంగ్రెస్ బిజెపి ఒక్కటే అని..!
గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వం కెసిఆర్ గారి మేడపై కత్తి పెట్టి వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని, ఎన్ని రకాలుగా ఒత్తిళ్ల కు గురిచేసిన తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులో మోటార్లకు మీటర్లు పెట్టబోమని కరాఖండిగా తెల్చిచెప్పారు.. అలాగే అసెంబ్లీ లో తీర్మానం కూడా చేసారు..!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు..! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే కెసిఆర్, బిఆర్ఎస్ పార్టీ బురదజల్లే ప్రయత్నం..!
నిన్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు పై అసెంబ్లీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ consumers other than agricultural consumers అనే పదాన్నే లేపేసారు..! రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో దిట్ట ఈ చోటేభాయ్..!
మీటర్లు పెడితే రాష్ట్రంలో సుమారు 98 లక్షల కుటుంబాలకు.. అంటే ఇంచుమించు కోటి కుటుంబాలకు దెబ్బ…!
దళితులకో, గిరిజనులకో, రైతులకో, రజకులకో, నాయీ బ్రాహ్మణులకో, పౌల్ట్రీ ఇండస్ట్రీకో, టెక్స్‌టైల్ ఇండస్ట్రీకో, ఇతర చిన్న పరిశ్రమలకో.. వారిని బతికించాలనే ఉద్దేశంతో విద్యుత్తులో కొంత సబ్సిడీ ఇస్తాం. కేంద్ర చెప్పిన సంస్కరణలను తెలంగాణలో యథాతథంగా అమలు చేస్తే తక్షణమే వీటన్నింటికీ మీటర్లు పెట్టాల్సిందే. ఈ సబ్సిడీలు అన్నీ పోతయి…!
ఈ దేశంలో విద్యుత్తు రంగంలో 20 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నరు. వీళ్లంతా కూడా ఇప్పుడు నేను చెప్తున్న మాటలు వినాలి. వీళ్ల నౌకర్లు కూడా గ్యారంటీగా పోతయి..!
తెలంగాణలో మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు,..!