బ్రాయిలర్ చికెన్‌లో క్యాన్సర్ కారకమైన ఆర్సెనిక్ రసాయనం…
చికెన్ తింటే మన శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. అందువల్ల ప్రోటీన్స్ వల్ల వ్యాధి నిరోధకశక్తి మరింత బలపడుతుంది.
తద్వారా రకరకాల వైరస్‌లను ఎదుర్కొనే శక్తి మన శరీరానికి వస్తోంది. అయితే నాటుకోడి తింటే ఆరోగ్యానికి మేలు గానీ ఫారం కోళ్లను ఎక్కువగా తింటే మాత్రం లేనిపోని ఆరోగ్య సమస్యలు తప్పవు. వారానికి ఒకటి రెండుసార్లు చికెన్ కర్రీ వండుకుంటే పర్వాలేదు గానీ వారంలో నాలుగైదు సార్లు లేదా వారమంతా చికెన్ తింటే కచ్చితంగా ప్రమాదమే.
అసలు చికెన్ ఎక్కువగా తింటే వచ్చే సమస్యలేంటో చకచకా తెలుసుకుందాం. ప్రొసెసింగ్ మాంసం కంటే చికెన్ వండుకొని తినడం చాలా మంచిది.
అందులో సి బి విటమిన్లు ఉంటాయి. ఫోలేట్ సెలీనియం, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి.
అయితే చికెన్ కంటే చేపలు తాజా పండ్లు, కూరగాయలు తినడం ఎంతో మంచిది అంటున్నారు. రోజుకి 170 గ్రాముల కంటే ఎక్కువ మాంసం తినకూడదని అంటున్నారు. అంతకంటే ఎక్కువ తింటే ఫుడ్ పాయిజనింగ్, డెలియా, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.
చికెన్ను తెచ్చిన వెంటనే 23 గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిజ్‌లో పెట్టి అమెరికన్ల లాగా వారమంతా కొద్ది కొద్దిగా వండుకుంటూ ఉంటే ఈలోగా బ్యాక్టీరియా పెరిగి ఏదో ఒకరోజు పొట్టలో తేడా కొట్టేస్తుంది. ఆసుపత్రిపాలు కావాల్సి ఉంటుంది. అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరికి ఫుడ్ పాయిజన్ సమస్య కామన్ గా ఉంటుంది.
ఈ కొలి బ్యాక్టీరియా చికెన్ పై ఉంటుందని తేల్చారు. నిల్వలపై మాత్రమే ఉంటుంది. ఫారం కోళ్లకు మొక్కజొన్న ఎక్కువగా వేస్తారు. ఇది చికెన్‌లో కొవ్వు బాగా పెంచుతుంది. ఈ చికెన్ మనం తింటే మనకు అదే కొలెస్ట్రాల్ పట్టుకుంటుంది.
చికెన్ కొద్దిగా తింటే బరువు తగ్గొచ్చు. అదే చికెన్ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. కొన్ని దేశాల్లో కోళ్లు లావుగా త్వరగా పెరిగేందుకు వాటికీ యాంటీవయోటిక్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. అలా పెరిగిన కోడి విషంతో సమానం. మనక్కూడా ఫారాల్లో రైతులు అంతటి దారుణాలకు పాల్పడలేదు.
మొక్కజొన్నతోనే పెంచుతున్నారు. కానీ విదేశీ కంపెనీల రెస్టారెంట్ లో మాత్రం విదేశీ కోళ్ల మాంసం లభిస్తాయి. టెస్ట్ కోసం తిన్నారంటే ఆరోగ్యం అటకెక్కినట్లే. క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. చికెన్ ఎప్పుడు తిన్నా కర్రీ లు చేసుకొని తినడం మేలు. ఫ్రై చేసుకొని అస్సలు తినకూడదు.
ఎందుకంటే చికెన్ బాగా ఎక్కువగా ఫ్రై అయితే అది మన బాడీలోకి వెళ్లి క్యాన్సర్ సోకేందుకు కారణమవుతుందని పరిశోధనలు తేల్చాయి. ఎప్పుడో ఒక సారి ఫ్రై తింటే తప్పు లేదు కానీ రోజు అదే పనిగా తింటే క్యాన్సర్ ముప్పు తప్పదు.
కోళ్లకు పెట్టే ఆహారంలో ఆర్సెనిక్ అనే విష రసాయనం ఉంటుంది. దీనివల్ల కోళ్లు మంచి కలర్‌లోకి వస్తాయ్. దిట్టంగా పెరుగుతాయి. అడుగు తీసి అడుగు వేయలేనంత లావుగా అవుతాయి. కానీ ఆ కోళ్లను మనం ఎక్కువగా తింటే గుండె జబ్బులు డయాబెటిస్, నరాల బలహీనత, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సూపర్ మార్కెట్‌లో నిల్వ ఉంచే 50% చికెన్లో ఆర్సెనిక్ ఉంటుంది.