జగిత్యాల జిల్లా…
మైనర్ బాలికల పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 5000/- జరిమాన.
బాధిత మైనర్ బాలికకు 3 లక్షల రూపాయలు పరిహారం.
జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన 4 సంవత్సరాల మైనర్ బాలిక తన ఇంటి దగ్గరలో గల కిరణం షాప్ లో తన అన్న తో కలిసి తినూబండరాలను కొనుకొని ఇంటీ కి వెళ్తున్న సమయం లో అదే గ్రామానికి చెందిన నిందితుడు కండ్లె రమేష్ బాబు వయసు 32 సంవత్సరాలు అనే వ్యక్తి మైనర్ బాలిక అన్నాను కిరాణం షాప్ లోకి వెళ్లి టమాటాలు కొనుక్కొని రమ్మని పంపించి మైనర్ బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేయగా మైనర్ బాలిక అరుపులు విని అక్కడికి వచ్చిన మైనర్ బాలిక అన్న అ యొక్క సంఘటన చూసి అరవగా పక్కన ఉన్న వారందరూ అందరూ వచ్చేసరికి నిందితుడైన రమేష్ బాబు పారిపోవడం జరిగింది.
బాలిక తల్లీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్: 483/2020 U/s 376(AB) IPC & sec 5( m) 6 of Pocso act. పోక్సో చట్టం కింద జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేయగా సర్కిల్ ఇన్స్పెక్టర్ లు రాజేష్ ,కృష్ణ కుమార్ కేసును విచారించడం జరిగింది.
పిపి గారు కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన గౌరవ న్యాయమూర్తి శ్రీమతి నీలిమ గారు 24-07-2024 రోజున నిందితుని పై నేరం రుజువు కాగా నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారగార శిక్ష మరియు 5000/- జరిమాన, బాధిత బాలికలకు 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.
ఈ యొక్క కేసుల్లో తప్పకుండా శిక్ష పడుతుంది గమనించిన నిందితుడు కండ్లే రమేష్ బాబు తేదీ 24 -07-2024 రోజున కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నది ఈ విషయం తెలుసుకున్న న్యాయమూర్తి శ్రీ నీలమ జిల్లా జడ్జి గారు నిందితుడు పై వారెంట్ ఇష్యూ చేయగా ఈరోజు పోలీసులు నిందితుడు అయిన కండ్లే రమేష్ బాబు పట్టుకొని జైలుకు తరలించడం జరిగింది.
ఈ యొక్క కేస్ లో పీపీ మల్లికార్జున్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా సి.ఐ లు , రాజేష్ ,కృష్ణ కుమార్ ఎస్సై సతీష్ , CMS ఎస్.ఐ రాజు నాయక్, కోర్ట్ కానిస్టేబుల్ నరేష్ మరియు CMS కానిస్టేబుల్స్ కిరణ్, రాజు మరియు మమత లు నిందితునికి శిక్ష పడడం లో గౌరవ కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. పై కేస్ లో నిందితునికి శిక్ష పడటం పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ అభినందించారు.