SC వర్గీకరణపై సుప్రీం చారిత్రాక తీర్పు… ఎర్రోళ్ల శ్రీనివాస్ SD, ST కమిషన్ మాజీ చైర్మన్
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాం. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
50ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించింది. ఎన్నో ఏళ్ల పోరాటానికి నేడు ఫలితం లభించింది. ఎన్నో త్యాగాలకు గౌరవం దక్కింది. దశాబ్దాల కల నెరవేరింది.
దళితులందరకీ ఇది పండుగ రోజు. ఇంటింటా సంబురాలు జరుపుకునే రోజు.
ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బిఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించారు.
అదే తీర్మానం కాపీనీ, దళిత నాయకులను ఢిల్లీకి వెంట తీసుకువెళ్లి ప్రధాని మోదీ గారిని కలిసి వివరించారు.
సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత, వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్లలో, విద్య, ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను.